కరీంనగర్

విధుల్లోకి న్యాయమూర్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లీగల్ (కరీంనగర్), జూలై 5: హైకోర్టు విభజన కోసం న్యాయమూర్తులు మూకుమ్మడిగా రాజీనామా చేసిన సందర్భంలో మంగళవారం జిల్లా వ్యాప్తంగా 16మంది న్యాయమూర్తులు విధుల్లోకి చేరారు. తెలంగాణ న్యాయమూర్తుల ఆధ్వర్యంలో ఆంధ్ర న్యాయమూర్తుల ఆప్షన్లను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్‌ను కలిశారు. ఈసందర్భంగా గవర్నర్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని న్యాయమూర్తులు ఒక నిర్ణయానికి వచ్చి కోర్టు విధులు చేపట్టారు. తెలంగాణ న్యాయమూర్తుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వరప్రసాద్ మరో న్యాయమూర్తి తిరుపతిలపై సస్పెన్షన్ వేటు పడింది. దీన్ని పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తులు మూకుమ్మడిగా 15 రోజుల పాటు సెలవు కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. సెలవు మంజూరు చేసే అధికారం ఆయా జిల్లా ప్రధాన న్యాయమూర్తులకు ఉండగా హైకోర్టు అనుమతి లేకుండా సెలవు మంజూరు చేయరాదని జిల్లా ప్రధాన న్యాయమూర్తులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లాలో విధులు నిర్వహిస్తున్న 16 మంది న్యాయమూర్తులు సెలవు అభ్యర్థనలను రాష్ట్ర హైకోర్టు తిరస్కరించడంతో మంగళవారం విధుల్లోకి చేరారు.
జిల్లాలో న్యాయమూర్తులు బదిలీ
మూడో అదనపు జిల్లా కోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్న కె.సుజన పదోన్నతిపై నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వెళ్ళనున్నారు. గోదావరిఖని ఆరవ అదనపు జిల్లా జడ్జిగా పనిచేస్తున్న వెంకటకృష్ణయ్య పదోన్నతిపై మహబూబ్‌నగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వెళుతున్నట్లు హైకోర్టు రిజిస్ట్రార్ మంగళవారం జాబితా విడుదల చేసింది.
జిల్లా కోర్టులో సర్వమత ప్రార్థనలు
ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకోసం, ఆంధ్ర న్యాయమూర్తుల ఆప్షన్లు మార్చుకోవాలని జరుగుతున్నటువంటి నిరసనలలో భాగంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి ఆయా కోర్టుల ఎదుట సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. జిల్లా కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపు మధుసూదన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు పి.వి రాజ్‌కుమార్ ఆద్వర్యంలో వివిధ మత గురువులతో ప్రార్థనలు జరిపారు. ఈ కార్యక్రమంలో రెవరన్ కె.వాట్సన్, ఎస్.ఎన్ మూర్తి, నిషాన్‌జీ, సర్దార్ దయాల్ సింగ్, మహ్మద్ అఫ్జల్ లు ప్రార్థనలు జరిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో హైకోర్టు ఏర్పాటు చేసేంతవరకు న్యాయవాదులు తమ ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని ఉపాద్యక్షులు రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు.
కొనసాగుతున్న న్యాయస్థాన ఉద్యోగుల దీక్షలు
తెలంగాణకు ప్రత్యేక హైకోర్టుతో పాటు ఆంధ్ర న్యాయమూర్తుల ఆప్షన్లు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ న్యాయస్థాన ఉద్యోగులు చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటికి నాలుగోరోజుకు చేరాయి. ఈ దీక్షలో శోభన్‌బాబు, వెంకటయ్య, శ్రీనివాస్, రాజేందర్, లక్ష్మణ్, సరిత, శారద, విజయ దీక్షలో పాల్గొనగా బార్ అసోసియేషన్ అద్యక్షులు మధుసూదన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు రాజ్‌కుమార్ వారికి మద్దతుగా సంఘీబావం ప్రకటించారు.