కరీంనగర్

ఓ మోస్తారు వర్షం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూలై 5: జూన్ మాసమంతా ఊరించి ఉసురుమన్పించిన వరుణ దేవుడు జూలై మొదటివారం నుంచే కొంతమేర కరుణ చూపిస్తున్నాడు. ఫలితంగా జిల్లాలో ఓ మోస్తారుగా వర్షాలు కురుస్తున్నాయి. శని, ఆదివారాల్లో జిల్లాలోని పలుచోట్ల ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడగా, సోమవారం రాత్రి నుంచి మంగళవారం వేకువజాము వరకు కూడా రెండు మండలాలు మినహా జిల్లా అంతటా వర్షాలు పడ్డాయి. జిల్లాలో సోమవారం రాత్రి నుంచి ఆదివారం వేకువముజాము వరకు కురిసిన వర్షాపాతం వివరాలు ఇలా ఉన్నాయి. కమలాపూర్ మండలంలో 25.2, జమ్మికుంటలో 14.2, ఎల్కతుర్తిలో 43.2, వీణవంకలో 22.0, హుజురాబాద్‌లో 17.6, భీమదేవరపల్లిలో 37.8, కరీంనగర్‌లో 22.4, బెజ్జంకిలో 29, కోహెడలో 20.4, తిమ్మాపూర్‌లో 28.6, చొప్పదండిలో 21, మానకొండూర్‌లో 10.4, కేశవపట్నంలో 11, గంగాధరలో 7.4, సైదాపూర్‌లో 17, హుస్నాబాద్‌లో 38.6, చిగురుమామిడిలో 10.6, రామడుగులో 8.4, ఇబ్రహీంపట్నంలో 5.2, మెట్‌పల్లిలో 24, సారంగపూర్‌లో 6.2, జగిత్యాలలో 9.2, కథలాపూర్‌లో 6.4, రాయికల్‌లో 9.6, కోరుట్లలో 7, మేడిపల్లిలో 2.8, ధర్మపురిలో 5, మల్యాలలో 3.6, మల్లాపూర్‌లో 10.2, కొడిమ్యాలలో 5.2, గొల్లపల్లిలో 2.4, చందుర్తిలో 14.8, గంభీరావుపేటలో 14.2, ముస్తాబాద్‌లో 21.2, సిరిసిల్లలో 19.2, వేములవాడలో 32.2, బోయినపల్లిలో 10.4, ఏల్లారెడ్డిపేటలో 13.8, ఇల్లంతకుంటలో 6.2, ఓదెలలో 15.2, పెద్దపల్లిలో 23.6, రామగుండంలో 10.4, కాల్వశ్రీరాంపూర్‌లో 27, సుల్తానాబాద్‌లో 11, ధర్మారంలో 6, జూలపల్లిలో 7.8, వెల్గటూర్‌లో 3.4, ఏలిగేడులో 10.8, మంథనిలో 54.4, కమాన్‌పూర్‌లో 14.8, కాటారంలో 14.4, మల్హర్‌లో 5.2, మంథని ముత్తారంలో 11.8, మహదేవ్‌పూర్‌లో 13, మహముత్తారం మండలంలో 19.4 మిల్లీ మీటర్ల చొప్పున వర్షం కురిసింది. జిల్లాలో మొత్తం 861.8మి.మీ. వర్షాపాతం నమోదు కాగా, సగటున 15.1 మి.మీ.వర్షాపాతం నమోదైంది. పెగడపల్లి, కోనరావుపేట మండలాల్లో చుక్క వర్షం పడలేదు. రెండుమూడ్రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతుల్లో ఆశలు చిగురింపజేస్తున్నాయి. అయితే, పత్తి, మొక్కజొన్న, పప్పు దినుసుల పంటలు మాత్రమే సాగవుతుండగా, వరి సాగవ్వడం లేదు. మరికొన్ని భారీ వర్షాలు కురిస్తే తప్ప వరి సాగు కష్టమే. వర్షాలు లేక నారుమడుల్లోనే వరి సేద తీరుతోంది. మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురిస్తే రైతులు హలాలు పట్టి పొలాల వైపుకు పరుగులు పెడతారు. జిల్లాలో సుమారు ఆరు లక్షల మంది వరకు రైతుల వరకు ఉండగా, జిల్లాలో 5.15లక్షల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయాధికారులు అంచనా వేయగా, ఇందులో వరి 1.85లక్షలు, మొక్కజొన్న 83.669, పత్తి 1,62,335 పంటలు సాగవుతాయని అంచనా వేశారు. అలాగే పెసర 10,742, కంది 13,241, బబ్బెర 250, మిరప 3,500, మినుములు 2,243, వేరుశనగ 150, నువ్వులు 10, శనగలు 10, సోయాబీన్ 31,761, చెరుకు 1200, పసుపు 10,000, ఆముదం 50, ఇతర పంటలు 11,039 హెక్టార్లలో సాగు చేస్తారని అంచనా వేశారు. ఇప్పుడిప్పుడే వానలు పడుతుండటంతో పత్తి, మొక్కజొన్న, పప్పు దినుసుల సాగు కొనసాతుండగా, వరి పంట సాగవ్వడం లేదు. మొత్తానికి నిన్నటిదాకా వానల కోసం నిరీక్షించగా, రెండుమూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతుల్లో ఆశలు చిగురింపజేస్తుండగా, మరిన్ని రోజులు వర్షాలు కురిస్తే ఏరువాక ఊపందుకోనుంది.