కరీంనగర్

తెలంగాణకే మణిహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ, జూలై 5: తెలంగాణ రాష్ట్రానికి కాళేశ్వరం - భద్రాచలం - కౌముతాల రహదారిని 370 కిలో మీటర్ల మేర జాతీయ రహదారిగా నిర్మిస్తున్నామని, ఇది తెలంగాణ రాష్ట్రానికే మణిహారంకానుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ రహదారి పూర్తయితే పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రాలకు మధ్య దూరం తగ్గి రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని, ఆ దారి వెంట ఉన్న ప్రాంతాలను త్వరిగత గతిన అభివృద్ధి సాధిస్తాయని ఆయన అన్నారు. కరీనంనగర్ జిల్లా వేములవాడ పట్టణంలోని మూలవాగుపై రూ.28 కోట్లతో చేపట్టనున్న రెండు బ్రిడ్జి నిర్మాణ పనులకు జిల్లా మంత్రి ఈటల రాజేందర్‌తో కలసి ఆయన మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రహదారులను జాతీయ రహదారులుగా చేపట్టడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని అన్నారు. దేశంలో చివరి రాష్టమ్రైన తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల్లో వైవిద్యమైన మార్పులను ప్రభుత్వం తీసుకువచ్చిందని, ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతి పనులు చూసి ఇతర రాష్ట్రాలు ఆశ్చర్యపోతున్నాయని అన్నారు. అభివృద్ధిలో ధనిక రాష్ట్రాలతో పోటీ పడి భవిష్యత్తులో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానాన్ని ఆక్రమిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రగతి పనుల్లో అడుగడుగునా ఇబ్బందులను సృష్టిస్తున్నదని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయడంలో వెనుకపడిన చంద్రబాబు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ ఫలాలు కంటగింపయ్యాయని విమర్శించారు. ఎలాగైనా ఈ రాష్ట్రంలో పరిపాలన స్తంభింపజేయడానికి ఆంధ్ర పాలకులు కుట్రలు పన్నుతున్నారని, అందుకు హైకోర్టులను ఆశ్రయిస్తూ అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని తెలిపారు. హైకోర్టును విభజించాలని, తెలంగాణ ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలో తలపెడుతున్న అభివృద్ధి పనులు, సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ వంటి అభివృద్ధి పనులు విజయవంతంగా పూర్తిచేయడానికి వేములవాడ శ్రీ రాజరాజేశ్వరుడు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఆశీస్సులను అందజేయాలని వేడుకున్నట్టు మంత్రి తెలిపారు.