కరీంనగర్

ప్రభుత్వ ఉద్యోగాల పేరిట ఘరానా మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్కతుర్తి, జూలై 5: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 6 లక్షల రూపాయలు వసూలు చేసిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు హుజురాబాద్ రూరల్ సిఐ గౌస్‌బాబా తెలిపారు. మంగళవారం ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌లో ముగ్గురు నిందితులను అరెస్టు చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్కతుర్తి మండలం కోతులనడుమ గ్రామానికి చెందిన ఎర్రోల్ల చైతన్య, దామెర గ్రామానికి చెందిన గొర్రె కుమార స్వామి, జూలపల్లి మండలానికి చెందిన పటాకుల మహేష్‌లు ముఠాగా ఏర్పడి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఎల్కతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన జి.శ్రీలత నుండి 20వేలు, సుమలత నుండి 20వేలు, సోలంకి రాజేశ్వర్‌రావు వద్ద 1 లక్షా 87వేలు, కొమ్ముల రమేష్ నుండి 60వేలు, హుజురాబాద్‌కు చెందిన రేణికుంట సాంబరాజు వద్ద 45వేలు, ఇల్లందుల కవిత నుండి 1లక్షా 60వేలు, వసూలు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తానని గత కొంత కాలంగా తప్పించుకు తిరుగుతూ ఇల్లందుల కవితకు మైక్రో ఫైనాన్స్ నుండి నకిలీ ఆర్డరు కాపీ ఇప్పించారు. సదరు కవిత ఉద్యోగానికి వెళ్లగా అది నకిలీ ఆర్డరు అని తేలడంతో పోలీసులను ఆశ్రయించింది. దీంతో వారి గుట్టు రట్టయింది. ఒక్కొక్కరిగా తీగ లాగితే డొంక కదిలి వారి నకిలీ ప్రభుత్వ ఉద్యోగాల మోసం బయటపడింది. దీంతో మంగళవారం పోలీసులు బాదితుల ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సిఐ గౌస్‌బాబా తెలిపారు. అయితే ప్రభుత్వ ఉద్యోగాలు అంత సులువుగా రావని యువత దీన్ని గమనించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఎస్సై వంశీకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.