కరీంనగర్

జిల్లాలో 8 నుండి హరితహారం షురూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూలై 5: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమాన్ని జిల్లాలో 8 నుంచి ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ తెలిపారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆమె హరితహారంపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హరితహారంపై పోస్టర్లు, కరపత్రాలు, క్యాపులతో పెద్దఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 7వ తేదీన జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాలలో, గ్రామాలలో కళాకారులు, స్వయం సహాయక మహిళలు, యువకులతో ర్యాలీలు నిర్వహిస్తూ అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. 8న పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు ర్యాలీలో పాల్గొంటారని, అన్ని నియోజకవర్గాల్లో సాంస్కృతిక కళాకారులు ర్యాలీలో పాల్గొంటారని వివరించారు. 8 నుండి 22వ తేదీ వరకు 15 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, సాంస్కృతిక సారథి కళాకారులు హరితహారంపై విస్తృతంగా కళాజాత ప్రదర్శనలు నిర్వహిస్తారని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి మైక్‌సెట్‌తో కూడిన ఒక వాహనం సమకూరుస్తున్నట్లు, నిర్ధేశించిన షెడ్యూల్ ప్రకారం వీరు ప్రదర్శనలు ఇస్తారని తెలిపారు. ప్రతీ ఒక ఎన్‌సిసి కెడెట్ పది మొక్కలు నాటడంతో పాటు వాటి నిర్వహణ బాధ్యత వారే చూడాలని సూచించారు. ప్రజలకు కావాల్సిన మొక్కలను అందజేస్తామని తెలిపారు. కావాల్సిన మొక్కలను గ్రామ సర్పంచ్, కార్యదర్శి అనుమతితో నర్సరీల నుండి మొక్కలను తీసుకోవచ్చునని, పట్టణాలలో మేయర్, కమీషనర్, కార్పోరేటర్ల అనుమతితో నర్సరీల నుండి మొక్కలు తీసుకోవచ్చునని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు జెసి నాగేంద్ర, అటవీశాఖ అధికారులతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.