కరీంనగర్

ప్రతి నీటి చుక్క వినియోగంలోకి తీసుకువస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి రూరల్, జూలై 19: వర్షపు నీరు వృథా పోకుండా తగిన ఏర్పాట్లు చేసి, ప్రతి నీటి చుక్కను వినియోగంలోకి తీసుకు వస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. పెద్దపల్లి మండలం గుర్రాంపల్లి గ్రామ సమీపంలోని గుట్ట వద్ద గల పులిమడుగు (పులి గుండం) ప్రాంతాన్ని స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో కలసి మంత్రి మంగళవారం సందర్శించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఈటల మాట్లాడుతూ పులి మడుగు గుట్టల నుంచి వస్తున్న వరద నీరు వృథా పోకుండా చెక్‌డ్యాం నిర్మాణం చేపట్టి పంట పొలాలకు సాగు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దసరాలోగా పులిమడుగుకు సంబంధించిన సర్వే చేపట్టి చెక్‌డ్యాం నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత మఖ్యమంత్రి కెసిఆర్ వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్టు తెలిపారు. బంగారు తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, అటవీ శాఖ జిల్లా అధికారి, స్థానిక ఆర్డీవో అశోక్ కుమార్, ఎంపిపిలు సందనవేన సునీత, గోపగోని సారయ్యగౌడ్, జడ్పీటిసిలు యాట దివ్యారెడ్డి, లంక సదయ్య, సర్పంచ్ మాదిరెడ్డి తిరుపతిరెడ్డి, ఎంపిటిసి మహేందర్‌రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.