కరీంనగర్

నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, జూలై 19: నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత గ్రామస్థులదేనని ఎస్పీ జోయల్ డేవిస్ పిలుపునిచ్చారు. మంగళవారం పోలీసు శాఖ దత్తత తీసుకున్న సిరిసిల్ల మండలం చిన్నిలింగాపూర్‌లో ఎస్పీ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పోలీసులు ఇక్కడ పునరుద్ధరించిన ఎల్లమ్మ చెరువు వద్ద హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఇక్కడ జరిగిస సమావేశంలో జిల్లా ఎస్పీ జోయల్ డేవిస్ మాట్లాడుతూ నాటిన ప్రతీ మొక్కను రక్షించుకోవాలని, ఇది అందరి బాధ్యతగా పేర్కొన్నారు. పోలీసులు తమ వృత్తిలో భాగం కాకున్నా భాగస్వామ్యమై గ్రామాలను దత్తత తీసుకుని చెరువుల పునరుద్ధరణ, నేరాలను నియంత్రించి అవినీతి రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడం, సంపూర్ణ అక్షరాస్యత, ఇంకుడు గుంటల నిర్మాణాలు, హరిత హారం కార్యక్రమాలన్నింటిని చేపడుతున్నదన్నారు. దీనికి ప్రజలు బాసటగా నిలువాలన్నారు. ప్రజలు భాగస్వామ్యంతో హరితహరం చేపడితే భావితరాలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నాటిన ప్రతీ మొక్కను రక్షించి, అది పెరిగే బాధ్యత తీసుకోవాలని ఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, డిఎస్పీ సుధాకర్, సెస్ చైర్మన్ లక్ష్మారెడ్డి, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ జిందం చక్రపాణి, తెరాస నాయకులు చీటి నర్సింగరావు, సర్పంచ్ సత్యకుమార్‌రావు, జడ్పీటిసి మంజుల, ఎంపిటిసి దేవేందర్, ఎంపిడివో మదన్‌మోహన్, మండల టిఆర్‌ఎస్ అధ్యక్షుడు అంకారపు రవీందర్, అగ్గిరాము, సిఐ జి.విజయకుమార్‌లు పాల్గొన్నారు.