కరీంనగర్

ప్రచారం ఫుల్.. సంక్షేమం నిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, జూలై 19: కెసిఆర్ ప్రభుత్వం ప్రచారానికి, ఇతర పార్టీల నుండి వలసల ప్రోత్సాహానికి ఇచ్చినంత ప్రాధాన్యత, ప్రజా సంక్షేమానికి ఇవ్వడం లేదని మాజీ మంత్రి డి.శ్రీ్ధర్‌బాబు ధ్వజమెత్తారు. మంగళవారం దైవ దర్శనానికై ధర్మపురికి విచ్చేసిన ఆయన నియోజకవర్గ ముఖ్య నేతల, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్లాగౌడ్ అధ్యక్షతన, జడ్పీ మాజీ చైర్మన్ లక్ష్మణ్‌కుమార్ అతిథిగా నిర్వహించిన సమావేశంలో శ్రీ్ధర్‌బాబు మాట్లాడారు. డబుల్‌బెడ్ రూం, ఎకరాలు దళితులకు పంపిణీ, ఉచిత విద్య, 12శాతం మైనారిటీ రిజర్వేషన్ల వంటి ఎన్నికల వాగ్ధానాలను మరిచారని విమర్శించారు. రైతుల రుణమాఫీని నిర్లక్ష్యం చేసి, పార్టీ బలోపేతం అంటూ, నాయకత్వ లేమితో, ఇతర పార్టీల నేతలను స్వార్థ చింతనతో అరువు తెచ్చుకుంటున్నారని ఆరోపించారు. లాభ, నష్టాలు బేరీజు వేసేందుకు రాజకీయం వ్యాపారం కారాదన్నారు. పార్టీని పటిష్టం చేసుకోవాలి గాని, శ్రమ దోపిడీ ఆమోదం కాదన్నారు. హరితహారం అంటూ, కోట్లాది నిధులను ప్రచారానికి వాడుకోవడం తప్పని, గత 60ఏళ్ళ నుండి తెలంగాణ ఏడారిలో ఉందా అని ప్రశ్నించారు. ఈనెల 25న పెద్దపెల్లిలో పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహిస్తున్నామని, ఎఐసిసి కార్యదర్శి కుంతియా, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు, పిసిసి సారథి ఉత్తమ్ కుమార్ తదితరులు వస్తున్నందున అధిక సంఖ్యలో రావాలని కోరారు. జిల్ల నేతలు గోమాసు శ్రీనివాస్, శంకర్‌రావు, నారాయణ రెడ్డి,ప్రకాశ్ రెడ్డి, దామోదర్ రెడ్డి, వడ్లూరి కృష్ణ, చుక్క రవి, దినేశ్, మల్లేశం, లక్ష్మణ్ పాల్గొన్నారు.