కరీంనగర్

ఫీజుల నియంత్రణలో సర్కార్ విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, జూలై 19: గత కొంతకాలంగా రాష్ట్రంలోని విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చడంలో, విద్యా రంగంలో నెలకొన్న సవాళ్ళను అధిగమించటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టిడిపి జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు విమర్శించారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ తెలుగునాడు విద్యార్థి సమాఖ్య జిల్లాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఈకార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న చింతకుంట మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి విద్యార్థులను వాడుకున్న కెసిఆర్ అధికారంలోకి రాగానే వారిని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే తమకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆశించిన వారికి ముఖ్యమంత్రి వ్యవహరశైలి నిరాశే మిగుల్చుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్ళు గడిచినా ఇప్పటికీ ఫీజు రీయంబర్స్‌మెంట్ చెల్లింపులు లేవని, పరీక్షల వేళ ఫీజుల వసూళ్ళ కోసం ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు నిర్బంధ వసూళ్ళకు పాల్పడుతున్నాయని, ఫీజులు చెల్లిస్తేనే హాల్‌టికెట్లు ఇస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాయని దుయ్యబట్టారు. వీటిపై ఎన్నోమార్లు ఫిర్యాదులు చేసినా ఎందుకు పట్టించుకోవటంలేదని ప్రశ్నించారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజులు, నిర్బంధ వసూళ్ళను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విజయరమణారావు ఆరోపించారు. సర్కార్ ఉదాసీన వైఖరి కారణంగా కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాల ఆగడాలకు అడ్డూ,అదుపులేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల ఇష్టారాజ్య వసూళ్ళకు కళ్ళెం వేయాలని డిమాండ్ చేశారు. కెజి టు పిజి ఉచిత విద్యాపథకాన్ని సత్వరమే అమలుచేయాలని, ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, సంక్షేమ వసతిగృహాల సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు. టిఎన్‌ఎస్‌ఎఫ్ జాతీయ సమన్వయ కమిటీ సభ్యుడు తాటికొండ రమేశ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో టిఆర్‌ఎస్ రాక్షసపాలన సాగిస్తోందని విమర్శించారు. విద్యార్థుల సమస్యలు తీర్చకుండా మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతుందని దుమ్మెత్తిపోశారు. ప్రత్యేకరాష్ట్రంకోసం ఉద్యమించిన స్ఫూర్తితో తమ సమస్యల పరిష్కారం కోసం మరోసారి విద్యార్థులు రోడ్డెక్కే పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ శ్రీదేవసేనకు వినతిపత్రం అందజేశారు. సుమారు రెండు గంటలపాటు నిర్వహించిన ఈధర్నాలో టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్లపల్లి రవీందర్, నాయకులు పెట్టెం నవీన్, మద్దెల గట్టుయాదవ్, సింగ్ శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బండి శ్రీకాంత్, బొంకూరి అవినాష్, నగరశాఖ అధ్యక్షుడు బద్దం అజయ్‌రెడ్డి, టేకుల శ్రవన్, రాకేశ్, ప్రవీన్, సుశాంత్, వినోద్, గరదాసు మహేశ్, సాయికిరణ్‌రెడ్డి, కె.మహేందర్, రాము, టిడిపి నగరశాఖ అధ్యక్షుడు కె. ఆగయ్య, నాయకులు రొడ్డ శ్రీనివాస్, కొరటాల శివరామకృష్ణ, ఆడెపుకమలాకర్, హసన్‌మహ్మద్‌లతోపాటు 400మంది విద్యార్థులు పాల్గొన్నారు.