కరీంనగర్

టిఎంయు విజయకేతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూలై 19: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టిఎంయు) జోరు కొనసాగింది. జిల్లాలో 11డిపోలుండగా, 10డిపోల్లో టిఎంయు విజయం సాధించింది. అలాగే కరీంనగర్ నాన్ ఆపరేషన్ జోన్‌లో రెండు స్థానాలుంటే ఆ రెండింటిని కైవసం చేసుకుంది. టిఎంయుకు ప్రధాన పోటీ ఇచ్చిన ఎంప్లాయిస్ యూనియన్ (టియు) ఒకే ఒక స్థానం వేములవాడతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మంగళవారం జిల్లాలో జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తెలంగాణ ఏర్పాటు అనంతరం తొలిసారిగా ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికలు జరిగాయి. ఉదయం 5గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరగగా, అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టారు. కరీంనగర్ వన్ డిపోలో ఈయుపై 148ఓట్ల తేడాతో, కరీంనగర్ టూ డిపోలో ఈయుపై 22ఓట్ల తేడాతో, హుజురాబాద్ డిపోలో ఈయుపై 57ఓట్ల తేడాతో, హుస్నాబాద్ డిపోలో ఈయుపై 125 ఓట్లు, సిరిసిల్ల డిపోలో ఈయుపై 97 ఓట్లు, కోరుట్ల డిపోలో ఈయుపై 226 ఓట్లు, మెట్‌పల్లిలో ఈయుపై 22ఓట్లు, జగిత్యాలలో ఈయుపై 121 ఓట్లు, మంథనిలో ఈయుపై 133 ఓట్లు, గోదావరిఖని డిపోలో ఈయుపై 298 ఓట్ల తేడాతో టిఎంయు విజయం సాధించింది. అలాగే నాన్ ఆపరేషన్‌లోని జోనల్ వర్క్‌షాప్‌లో ఈయుపై 55ఓట్ల తేడాతో, ఆర్‌ఎం ఆఫీస్‌లో ఈయుపై 22ఓట్ల తేడాతో టిఎంయు విజయం సాధించింది. వేములవాడ డిపోలో మాత్రం టిఎంయుపై 23ఓట్ల తేడాతో ఈయు విజయం సాధించింది. టిఎంయు ఘన విజయం సాధించడం పట్ల ఆ యూనియన్ నాయకులు, కార్మికులు సంబరాల్లో మునిగితేలారు. ఆర్టీసీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు చేపట్టగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్మిక శాఖ అధికారులు ఎన్నికలను నిర్వహించారు.