కరీంనగర్

హరితహారం లక్ష్యాలను సాధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూలై 19: హరితహారం లక్ష్యాలను సాధించాలని కలెక్టర్‌ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్) రాజీవ్‌శర్మ ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుండి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈసందర్భంగా సిఎస్ రాజీశ్ శర్మ మాట్లాడుతూ మొక్కలు నాటడాన్ని వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాలలో టేకు, పండ్ల మొక్కలకు డిమాండ్ ఉందని, అన్ని జిల్లాలలో జిల్లా కలెక్టర్‌లు టేకు పండ్ల మొక్కల కొనుగోలుకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. ముందుగా ప్రభుత్వ నర్సరీలలో ఉన్న మొక్కలు నాటడం పూర్తయిన తరువాత ప్రైవేటు నర్సరీలలోని మొక్కలను కొనుగోలు చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు హరితహారంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, నాటిన మొక్కలు బతికేవిదంగా చర్యలు తీసుకోవాలన్నారు. హరితహారంలో ఉపాధి హామీ నిధులను వినియోగించుకోవడానికి అవసరమైన సవరణలు చేస్తున్నామని ఈ నిధులను మొక్కల నిర్వహణకు ఉపయోగించుకోవాలని అన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని, దరఖాస్తులు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. షాది ముబారక్ 17535 దరఖాస్తులు, కళ్యాణలక్ష్మి 17222 దరఖాస్తులు పరిశీలన చేసినట్లు తెలిపారు. శాఖల వారీగా మొక్కలు నాటిన వివరాలపై సమీక్షించారు. ఉపాధి హామీ, సోషల్ ఫారెస్ట్ నిధులను నిర్వహణకు ఉపయోగించుకొనే విదంగా ప్రణాళిక ఉండాలని అన్నారు. వారం రోజల లోపు మైక్రో యాక్షన్ ప్లాన్ పంపాలన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నాటిన మొక్కల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. మొక్కల సంరక్షణ కోసం గ్రామాలలో గ్రామ పంచాయితీలకు బాధ్యతలను అప్పగించామని, త్వరలోనే మొక్కల సంరక్షణకు తీసుకొనే చర్యలపై మైక్రో ప్రణాళికలను రూపొందించి ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. నీటి వసతి లేని చోట బోరువెల్స్ మంజూరు చేసినట్లు, లక్ష్యం సాధనకు జిల్లాలో మాస్ ప్లాంటేషన్ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాకు ఇంకా 40 లక్షల టేకు మొక్కలు అవసరమని, ఆర్ అండ్ బి రోడ్లపై 358 కిలోమీటర్ల మేర మొక్కలను సోషల్ ఫారెస్ట్ ద్వారా నాటనున్నట్లు తెలిపారు. ఎస్పీ జోయల్ డేవిస్ మాట్లాడుతూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 7.34 లక్షల మొక్కలు నాటినట్లు 8 లక్షలు లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీదేవసేన, నగర పాలక కమిషనర్ కృష్ణ్భాస్కర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.