కరీంనగర్

డబుల్.. ట్రబుల్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూలై 19: కొన్ని ప్రాంతాల్లో స్థలాలు దొరకడం కష్టంగా ఉంటే.. స్థలాలు దొరికిన ప్రాంతాల్లో కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఫలితంగా డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం ట్రబుల్ ఎదుర్కొంటోంది. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చి రాష్ట్రంలో అధికారంలో చేపట్టిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు అడుగులేసినా.. ముందుకు కదలడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరలతో కాంట్రాక్టర్లు ఎవరూ కూడా ముందుకు రాకపోవడంతో డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం జిల్లాలో ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. సిఎం కెసిఆర్ దత్తత గ్రామం మినహా జిల్లాలో ఏ ఒక్క చోట కూడా ఇళ్ల నిర్మాణాలు మొదలుకాలేదు. ఇళ్ల నిర్మాణాల కోసం అధికారులు మూడుసార్లు టెండర్లు పిలిచినా.. కాంట్రాక్టర్ల నుంచి స్పందన రాలేదు. దీంతో డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం ముందుకు కదలకపోగా, ఎంపికైన లబ్దిదారుల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి. జిల్లాలో 13 నియోజకవర్గాలుండగా, ఒక్కొ నియోజకవర్గానికి 400 ఇళ్ల చొప్పున మొత్తం 5,200 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేయగా, అర్బన్‌లో 160, రూరల్‌లో 240 ఇళ్ల చొప్పున కేటాయించారు. ఇవేకాక సిఎం కెసిఆర్ దత్తత తీసుకున్న చిగురుమామిడి మండలం చినముల్కనూరు గ్రామంలో 247, సిరిసిల్ల నియోజకవర్గంలో అదనంగా 1500 ఇళ్లను మంజూరు చేసింది. మొత్తం జిల్లాకు 6,947 ఇళ్లు మంజూరయ్యాయి. జిల్లాలో డబుల్ బెడ్ రూం పథకానికి 93,435 మంది లబ్ధిదారులు ధరఖాస్తు చేసుకోగా, 3,550 మంది లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేశారు. సిఎం దత్తత గ్రామంలో 450 మంది దరఖాస్తులు చేసుకోగా, 247 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. రూరల్‌లో రూ.5.04లక్షలు, అర్బన్‌లో రూ.5.30లక్షల చొప్పున నిర్ధారించారు. ప్రభుత్వం ప్రాతిపాదించిన ఖర్చుతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. కరీంనగర్, సిరిసిల్ల, హుస్నాబాద్, హుజురాబాద్, మానకొండూర్ నియోజకవర్గాల్లో నిర్మించే ఇళ్ల నిర్మాణాలకు రూ.12426.40 లక్షలు, ధర్మపురి, వేములవాడ, కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల్లో రూ.9987.20 లక్షలు, చొప్పదండి, మంథని, రామగుండం, పెద్దపల్లి నియోజకవర్గాల్లో నిర్మించే ఇళ్ల నిర్మాణాలకు రూ.9987.20 లక్షల అంచనాలతో అధికారులు మూడుసార్లు టెండర్లు పిలిచారు. అయినా ఏ ఒక్క కాంట్రాక్టర్ ముందుకు రాలేదు. మరోమారు టెండర్లు పిలిచేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సిఎం కెసిఆర్ దత్తత గ్రామంలో మాత్రం ఇళ్లను నిర్మించేందుకు హైదరాబాద్‌కు చెందిన మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ కంపెనీ ముందుకు వచ్చి ఇళ్ల నిర్మాణాలు చేపట్టింది. ఈ ఇళ్ల నిర్మాణాలకు ఈ ఏడాది మే 6న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ శంకుస్థాపన చేయగా, ఆ పనులు మెల్లమెల్లగా కొనసాగుతున్నాయి. 247 ఇళ్లకు గాను 230 ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా, ఆ ఇండ్లు వివిధ దశల్లో పనులు కొనసాగుతున్నాయి. సిఎం దత్తత గ్రామం మినహా మిగిలిన 13 నియోజకవర్గాల్లో ఇళ్ల పథకం కాగితాలకే పరిమితమయ్యాయి. అదనంగా సిరిసిల్లకు మంజూరైన 1500 ఇళ్లు అంచనాల స్టేజీలోనే ఉన్నాయి. ఈ క్రమంలో ఎంపికైన లబ్ధిదారుల్లో రోజురోజుకు ఆశలు సన్నగిల్లుతున్నాయి. మొదటి దఫా ఇళ్లకే మోక్షం లేకపోతే, రెండో దఫా మంజూరయ్యే ఇళ్ల పరిస్థితి ఎంటనే ప్రశ్న అందరిలో వ్యక్తమవుతోంది. ఒకవేళ కాంట్రాక్టర్లు ముందుకు వచ్చినా.. ఆ ఇళ్లు పూర్తయ్యే సరికి పుణ్యకాలం గడిచిపోయేలా ఉందంటూ లబ్దిదారులు వాపోతున్నారు. కాగా, జిల్లాలో 60 వేల కుటుంబాలకు పైగా ఇళ్లు లేవని అధికారులు నిర్వహించిన సర్వేలో తేలింది. మొత్తానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం జిల్లాలో ఒక్క అడుగు కూడా ముందుకు కదలడం లేదు.