కరీంనగర్

మొక్కలు నాటడమే కాదు.. వాటిని సంరక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూలై 20: మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించుటకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖా మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బుదవారం ఎన్‌జిఒ కాలనీలో హరితహరం కార్యక్రమంలో బాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి మొక్కలు 70 రూపాయల నుండి 100 రూపాయల వరకు ఖర్చు చేస్తుందన్నారు. మొక్కలను బతికించుకున్నప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. మొక్కలు నాటినవారే వాటిని సంరక్షించే భాద్యత చేపట్టాలని తెలిపారు. మొక్కలకు నీరు పోయడమే కాకుండా వాటి రక్షణకు ట్రీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలన్నారు. మొక్కలు పెద్దవి అయి చెట్టుగా మారినప్పుడే వాతావరణంలో మార్పు వస్తుందని, ప్రస్తుతం ఉన్న వేడి వాతావరణం చల్లబడుతుందన్నారు. గ్లోబల్ వార్మింగ్ నివారణకు చెట్ల సంరక్షణయే మార్గమని తెలిపారు. ఎన్‌జిఒ కాలనీ మొత్తం చెట్లతో నిండాలని ప్రభుత్వం సరఫరా చేసిన మొక్కలే కాకుండా స్వంతంగా కొనుగోలు చేసి మొక్కలు నాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగర పాలక సంస్థ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.