కరీంనగర్

ఈ సర్పంచ్ మాకొద్దు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లారెడ్డిపేట, జూలై 22: ప్రజల సమస్యలను తీర్చాల్సిన సర్పంచ్ పట్టించుకోకపోవడంపై ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సుమారు రూ. 20 లక్షల పంచాయతీ, మరుగుదొడ్ల బిల్లులను లబ్ధిదారులకు చెల్లించడం లేదని ఆరోపిస్తూ ఉప సర్పంచ్, 9 మంది వార్డు సభ్యుల నేతృత్వంలోని ప్రజలు పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు. పాలక వర్గంలో కొనసాగలేమని స్పష్టం చేస్తూ మూకుమ్మడి రాజీనామాలు చేశారు. ఈ సర్పంచ్ మాకొద్దు అంటూ పంచాయతీ కార్యాలయానికి తాళం వేశారు. ఈ సంఘటన ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. వార్డు సభ్యులు, ప్రజల కథనం మేరకు.. సర్పంచ్ బదావత్ నాజం లబ్ధిదారులకు చెల్లించాల్సిన సుమారు రూ.10 లక్షలు అందించకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అభివృద్ధిపై తొమ్మిది నెలల నుంచి సభలు నిర్వహించడం లేదని ధ్వజమెత్తారు. గ్రామంలో రహదారులన్నీ బురదమయంగా మారిన పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పంచాయతీకి సంబంధించిన రూ.10లక్షలు సొంతానికి వాడుకున్నారని పేర్కొన్నారు. పాలక వర్గంలో తాము కొనసాగలేమని స్పష్టం చేస్తూ ఉప సర్పంచ్ పాశం దేవిరెడ్డి, వార్డు సభ్యులు పందిర్ల సుధాకర్, పెంజర్ల అన్నపూర్ణ, పెద్దూరి యశోద, లలిత, ఆకుల దేవవ్వ, పాశం సాయికుమార్, పందిర్ల నారాయణగౌడ్, మద్దెవేణి సత్తవ్వ, అందె కిషన్‌లు రాజీనామాలు చేశారు. పత్రాలను పంచాయతీ కార్యదర్శి రాజుకు అందజేశారు. సమాచారం అందుకున్న ఎంపిడివో చిరంజీవి చేరుకుని శాంతింపజేయడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. సర్పంచ్ వచ్చేంత వరకు తాళం తీసేదీ లేదని భీష్మించారు. గత్యంతరం లేని పరిస్థితి ఎంపిడివో చిరంజీవి వెనుదిరిగారు.