కరీంనగర్

తహశీల్దార్ అవినీతిపై కూపీ లాగుతున్న ఎసిబి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మికుంట, జూలై 22: తవ్వినకొద్ది అక్రమాలు వెలుగు చూస్తునే వున్నాయి. సక్రమమైన పనులకు సైతం దొడ్డిదారిలో అక్రమ వసూళ్లకు పాల్పడ్డ మాజీ తహశీల్దార్ మంకెన రజనీ వ్యవహార శైలి, అవినీతి బాగోతంపై ఎసిబి కూపీ లాగుతోంది. అరెస్ట్‌లతో విచారణ ముగిసినట్టేనని భావిస్తున్న తరుణంలో ఎసిబి ఇంకా ఆమె బాధితుల నుండి వివరాలు సేకరించే పనిలో పడింది. డిఎస్‌పి సుదర్శన్‌గౌడ్ ఆదేశాలతో ఎసిబి సిఐ సుందరగిరి శ్రీనివాస్‌రావు జమ్మికుంట రెవెన్యూ లీలలపై సమగ్రంగా లోతైన విచారణ చేస్తున్నారు. తహశీల్దార్ (ప్రస్తుత ఆర్డీవో డిఎవో) అవినీతిపై బాధితుల నుండి అందిన ఫిర్యాదులపై విచారణ జరిపి వాస్తవమని తేలడంతో ఆమెతో పాటు సహకరించిన విఆర్‌వో శ్రీనివాస్‌లను అరెస్ట్ చేయడంతో బాధితుల సంఖ్య రోజుకింత పెరుగుతోంది. పట్టాదారు పాసు పుస్తకాలు, విరాసత్, మ్యుటేషన్‌లతో పాటు నిబంధనలకు విరుద్ధంగా పనులు చేసిపెట్టి లక్షలాది రూపాయలు వెనకేసి అరెస్ట్ అయిన రజనీ, శ్రీనివాస్‌లపై కోకొల్లలుగా ఫిర్యాదులు అందుతున్నట్టు సమాచారం. డబ్బులిచ్చి పనులు చేయించుకున్న వారితో పాటు వేలాది రూపాయలు పుచ్చుకుని రేపు, మాపంటూ పనులు చేయకుండా దాటవేసి ఆర్ధంతర బదిలీపై వెళ్లడంతో అయోమయంలో పడ్డ బాధితులు ఎసిబి అధికారుల వద్ద క్యూ కడుతున్నట్టు సమాచారం. వీరి అవినీతి తంతుపై వస్తున్న ఫిర్యాదులతో ఎసిబి అధికారులే ముక్కున వేలేసుకుంటున్నట్టు సమాచారం. అందుతున్న సరికొత్త ఫిర్యాదులను స్వీకరించి వాటిపై విచారణ జరిపి వాస్తవమని తేలితే వాటిపై సైతం కేసులు నమోదు చేయడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. జమ్మికుంట రెవెన్యూ కార్యాలయానికి మచ్చ తెచ్చిన రజనీ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశమైంది. గతంలో పనిచేసిన అధికారులు తమ సమర్థతతో ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకోగా రజనీ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. వాటిని సమర్థించుకోవడమే తప్ప సంస్కరించుకోవడంలో విఫలమై చివరికి జైలు పాలై రెవెన్యూ పాలనకు మచ్చతెచ్చి పెట్టిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎసిబి సైతం అవినీతి ఫిర్యాదులపై విచారణను వేగవంతం చేసి ఇంకా ఇందులో సంబంధం వున్న వారు ఎంతటి వారైన చట్టం ముందు నిలబెట్టేందుకు సంసిద్ధమవుతున్నట్టు తెలిసింది. రెవెన్యూలో అవినీతిపై జరుగుతున్న పరిణామాలు ఇతర శాఖలపై ప్రభావం చూపుతున్నాయి. అన్ని శాఖల్లోనూ ఇదే చర్చ ప్రధానంగా కొనసాగుతోంది. ఎసిబి స్పందించిన తీరుతో ఇతర శాఖల్లో జరుగుతున్న అవినీతి తంతుపై కూడ ఫిర్యాదులు చేస్తున్నట్టు తెలియవచ్చింది.