కరీంనగర్

హరితహారం బాధ్యతగా భావించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంకరపట్నం, జూలై 22: ప్రభుత్వం చేపడుతున్న హరితహారం కార్యక్రమం అందరి బాధ్యతగా భావించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీదేవసేన అన్నారు. శుక్రవారం మండలంలోని మెట్‌పల్లి గ్రామంలో ఆమె హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాలలో ప్రజాప్రతినిధులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రణాళిక ఏర్పరచుకొని ఉధృతంగా కొనసాగించుకోవాలన్నారు. ప్రభుత్వం ఈ హరితహారం కార్యక్రమాన్ని పటిష్టవంతంగా చేపట్టేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు కొనసాగిస్తుందన్నారు. గ్రామాల్లో పర్యావరణ పరిరక్షణకు మొట్టమొదటగా చెట్లు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని వాటిని సంరక్షణ బాధ్యతను స్వీకరించాలని ఆమె చెప్పారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని విజయవంతమయ్యేలా వివిధ స్థాయి అధికారులతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని, ఇందుకు మన జిల్లాలో ఈ కార్యక్రమం ఆదర్శవంతంగా రాష్ట్రంలో నిలిచేలా కృషి చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి విజయ, జడ్పీటిసి సంజీవ రెడ్డి, తహశీల్దార్ సంపత్, ఎంపిడిఓ నరేష్, పాల్గొన్నారు.