కరీంనగర్

బెటాలియన్ స్థలం పరిశీలించిన జెసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, జూలై 22: సిరిసిల్ల మండలం సర్దాపూర్‌లో ఏర్పాటు చేస్తున్న పొలీస్ బెటాలియన్ స్థలంను జాయింట్ కలెక్టర్ శ్రీదేవసేన పరిశీలించారు. శుక్రవారం సాయంత్రం పోలీస్ బెటాలియన్ అధికారులు, ఆర్డీవో, రెవెన్యూ అధికారులతో కలిసి స్థల పరిశీలన జరిపారు. సర్దాపూర్‌లో ఏర్పాటు చేస్తున్న పోలీస్ బెటాలియన్‌కు 117 ఎకరాల స్థలంను ప్రభుత్వం కేటాయించింది. అయితే మరో అయిదు ఎకరాలు స్టేట్ హైవేకు ఆనుకుని కావాలని ప్రతిపాదనలు రావడంతో అదనపు స్థలం కేటాయింపు కోసం జాయింట్ కలెక్టర్ శ్రీదేవసేన పరిశీలించారు. ఈ సందర్భంగా పటాలను, స్థలాల అనుకూలతను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ బెటాలియన్ కమాండెంట్ శ్రీనివాసరావు, సిరిసిల్ల ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.