కరీంనగర్

హరితహారంలో అంతా పాల్గొనాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, జూలై 22: హరితహారంలో ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా పాల్గొని మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ మండలంలోని దుర్శేడ్ గ్రామంలో హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వన సంపదతో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని వర్షాలు సమృద్దిగా కురిసి పంటలు పండి రైతులు సుఖంగా జీవిస్తారని తెలిపారు. ఇప్పుడు నాటిన మొక్కలు భవిష్యత్ తరానికి జీవనాదారానికి తోడ్పడుతాయని సూచించారు. నాటిన మొక్కలను నీరు పోసి సంరక్షించాలని ట్రీగార్డులను పెట్టి పశువులు చెట్లు తినకుండా కాపాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.