కరీంనగర్

ధనిక రాష్ట్రంలో రుణమాఫీ విడతలెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూలై 22: ధనిక రాష్టమ్రని గొప్పలు చెప్పుకుంటున్న సిఎం కెసిఆర్ రైతు రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా విడతల వారీగా ఎందుకు చేస్తున్నారని టిడిపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా ఇన్‌చార్జి ఒంటేరు ప్రతాప్ రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా సమన్వయ కమిటి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే రుణమాఫీని ఏకకాలంలో అమలు చేస్తామంటూ ముఖ్యమంత్రి మోసగించారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా రుణమాఫీ అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. రుణబాధలు ఎక్కువై రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా సిఎం పట్టనట్లు వ్యవహరించడం దారుణమని పేర్కొన్నారు. గ్రామాల్లో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, ఇప్పటికైనా మీనమేషాలు లెక్కించకుండా రైతు రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్టుగా ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు ఆరేసి లక్షల పరిహారం అందడం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం పరిహారాన్ని అందజేసి రైతు కుటుంబాలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టిడిపి ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 26న జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు చేపట్టనున్నామని, అలాగే 28న జిల్లా కేంద్రంలోని లీడ్ బ్యాంక్ ఎదుట మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టిడిపిని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు పార్టీ ఇంచార్జిలు, నాయకులు సమన్వయంతో ముందుకు సాగాలని కోరారు. క్షేత్ర స్థాయి పర్యటనలు జరుపుతూ కార్యకర్తలు ఉత్సాహపర్చాలని, అసంపూర్తిగా ఉన్న మండల కమిటీలను ఈ నెలాఖరులోగా వేసి ఆన్‌లైన్ చేయించాలన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన టిడిపి జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల నాటికి పార్టీని సమాయత్తం చేసేందుకు ఇప్పటి నుంచే కృషి చేయాల్సిన అవసరముందన్నారు. జిల్లాలో పార్టీకి పూర్వవైభవం తెచ్చేలా నియోజకవర్గ ఇన్‌చార్జీలు, నాయకులంతా కలిసికట్టుగా పాటుపడాలని కోరారు. రైతు రుణమాఫీని వెంటనే అమలు చేయాలని, ఎస్సారెస్పీ నుంచి కాలువల ద్వారా జిల్లాలోని చెరువులు, కుంటలు నింపాలని, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ రుణాలను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థుల ఫీజు బకాయిలను పూర్తి స్థాయిలో వెంటనే చెల్లించాలని, ఇందిరమ్మ గృహాల బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సమావేశం తీర్మానించింది. ఈ సమావేశంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, అన్నమనేని నర్సింగారావు, ముద్దసాని కశ్యపు రెడ్డి, సాంబారి ప్రభాకర్, మద్దెల రవీందర్, డాక్టర్ మేడిపల్లి సత్యం పాల్గొన్నారు.