కరీంనగర్

షెడ్యూలు కులాల సంక్షేమం కోసం కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూలై 22: షెడ్యూలు కులాల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పలు పథకాలను అమలు పరుస్తుందని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన రెండు సంవత్సరాల కాలంలో షెడ్యూలు కులాల సంక్షేమం కోసం మూడెకరాల భూమి, కళ్యాణ లక్ష్మి వంటి కార్యక్రమాలను అమలు చేసిందన్నారు. ప్రతి నియోజక వర్గానికి లక్ష ఎకరాలకు సాగు నీరందించేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు పరుస్తుందన్నారు. షెడ్యూలు కులాల వారికి మూడెకరాల భూములు అందించి సాగుకు యోగ్యంగా ఉండేందుకు వ్యవసాయం, తదితర శాఖల సహకారం అందించడం జరుగుతుందన్నారు. గత సంవత్సరం 30 కోట్లతో 750 ఎకరాలను కొనుగోలు చేసి 300 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 360 కోట్లతో 10వేల ఎకరాలు కొనుగోలు చేసి 3025 మంది లబ్దిదారులకు పంపిణీ చేయడానికి ప్రణాళికలు రూపొందించిందని తెలిపారు. స్వయం ఉపాధి కింద 2014-15 ఆర్థిక సంవత్సరంలో 642 మందికి 8.56 లక్షలతో ఆర్థిక సహకారం అందించామని అర్హులైన షెడ్యూలు కులాల వారికి సహకారం అందిస్తామన్నారు. ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు అదనపు జాయింట్ కలెక్టర్ నాగేంద్ర మాట్లాడుతూ 2014-15 ఆర్థిక సంవత్సరంలో 271 ఎకరాలు, 2015-16 ఆర్థిక సంవత్సరంలో 755 ఎకరాల భూములను కొనుగోలు చేసి పంపినీ చేశామన్నారు. ఎస్సీలకు బ్యాంకుల ద్వారా 10 లక్షల వరకు ఆర్థిక సహకారం అందించి 5లక్షల వరకు సబ్సిడి పలు పథకాల ద్వారా మంజూరు చేయడం, నైపుణ్య శిక్షణలు ఇప్పించి ఆర్థిక సహకారం అందించడం కోసం శిక్షణ కార్యక్రమాలు జరుగుచున్నాయన్నారు. వ్యవసాయ యోగ్యమైన భూములను కొనుగోలు చేస్తూ తమ సంస్థ ద్వారా సహకారం అందిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఈ సంవత్సరం 1500 ఎకరాలను కొనుగోలు చేయడం జరుగుతుందని, ఇప్పటికే బూములను పరిశీలించి సాగునీటి యోగ్యత, భూగర్బ జలాల పరిశీలన, దర నియంత్రణ వంటి అంశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో డ్వామా పిడి వెంకటేశ్వర్‌రెడ్డి, డిఆర్‌డిఎ పిడి అరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు.