కరీంనగర్

పోచంపాడ్ నుండి ఎల్‌ఎండికి నీటి విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిమ్మాపూర్, ఆగస్టు 2: పోచంపాడ్ ప్రాజెక్టు నుండి ఎల్‌ఎండి రిజర్వాయర్‌లోకి బుధవారం రెండు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా మంగళవారం తిమ్మాపూర్ మండల అల్గునూర్ గ్రామ శివారులో గల ఎల్‌ఎండి రిజర్వాయర్‌కు ఆనుకొని ఉన్న ఫారెస్ట్ నర్సరీ స్థలంలో మంత్రి ఈటల రాజేందర్‌తో పాటు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జడ్పీచైర్‌పర్సన్ తుల ఉమ, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, కలెక్టర్ నీతూప్రసాద్ మొక్కలు నాటారు. ముందుగా అలుగునూర్ గ్రామ శివారులో గల స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ లో ఏర్పాటు చేసిన సెమినార్‌లో మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో బాగంగా తిమ్మాపూర్ మండలంలోని వివిధ గ్రామాలలో ప్రతిరోజు కొన్ని వేల మొక్కలు నాటడం జరిగిందన్నారు. నాటిన మొక్కలను ఒక సంవత్సరం పాటు సంరక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు. గతేడాది వర్షాలు సమృద్ధిగా లేకపోవడంతో నాటిన మొక్కలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని, ఈ సంవత్సరం వర్షాలు అనుకూలించడంతో ప్రతి ఇంటికి 5 మొక్కలను నాటాలన్నారు. ఈనెల 3వ తేదీన పోచంపాడ్ ప్రాజెక్టు నుండి 2 గేట్లు ఎత్తి ఎల్‌ఎండి రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేస్తున్నామని దీంతో ఎల్‌ఎండి రిజర్వాయర్‌లో 24 టిఎంసిల నీరు చేరుతుందని అన్నారు. మొక్కల పోషణకు అయ్యే ఖర్చు తమ వంతు బాధ్యతగా పూర్తి సహకారం అందిస్తామన్నారు. ప్రస్తుతం జిల్లాలో 2కోట్ల 48 లక్షల మొక్కలను నాటడం జరిగిందని అంతేకాకుండా మరో 2కోట్ల మొక్కలను నాటేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసిలు ఉల్లెంగుల పద్మ, సిద్దం వేణు, తన్నీరు శరత్‌రావు, ఎంపిపిలు బూడిద ప్రేమలత, ఎంపిడి ఒ పవన్‌కుమార్, సర్పంచ్ చందం కిష్టయ్య, ఎంపిటిసి సింగిరెడ్డి స్వామిరెడ్డి, పార్టీ మండల అద్యక్షుడు ఎడ్ల జోగిరెడ్డి, బుదారపు శ్రీనివాస్, మాతంగి లక్ష్మన్, మెంగెం రమేష్, రావుల రమేష్, కాటుక రాజవౌళి లతో పాటు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.