కరీంనగర్

రెవెన్యూ సమస్యల్ని త్వరగా పరిష్కరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఆగస్టు 2: పేద ప్రజలు, రైతులకు సంబందించిన రెవెన్యూ సమస్యల్ని ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖలపై మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ సాదాబైనామా, విరాసత్, మ్యూటేషన్‌ల ధరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. 277 మంది సర్వేయర్లను నియమించనున్నట్లు తెలిపారు. ఆక్రమిత ప్రభుత్వ భూములు, ప్రస్తుతం ఆధీనంలో ఉన్న భూముల వివరాలు తెలియజేయాలని ఆదేశించారు. రెవెన్యూ కార్యాలయాలకు పక్కా భవనాలు, సాధారణ ఖర్చులు, విద్యుత్ ఖర్చులకు నిధులు కేటాయించేందుకు ఉన్నతాధికారులతో చర్చించి మంజూరు చేస్తామన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో మొక్కలను లక్ష్యానికి అనుగుణంగా నాటాలన్నారు. రెవెన్యూ సిబ్బంది, అధికారులు అంకిత భావంతో వందశాతం పేద ప్రజలకోసం పనిచేయాలని ఉద్బోదించారు. రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ గ్రామ స్థాయి ప్రజలకు నాణ్యమైన సేవలందించాలని రెవెన్యూ అధికారులను కోరారు. గ్రామాలు, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు విస్తృతంగా అందించాలన్నారు. క్లోరినేషన్, పారిశుధ్య పనులు, తాగునీటి సరఫరా పైపుల లీకేజీల వంటివి పరిశీలించి వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని, ఇందుకు గ్రామాల్లోని శాకాధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జ్వరాలు, వైరల్ జ్వరాల బారిన పడకుండా అవసరమైన వైద్య సేవలు అందించాలన్నారు. 104, 108 వాహనాల సేవలను మరింతగా విస్తృత పరచాలన్నారు. సీజనల్ వ్యాదులపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమయంలో వైద్య సిబ్బందికి ఎలాంటి సెలవులు ఇవ్వకూడదని ఆదేశించారు. హరితహారం కార్యక్రమంలో రాష్ట్రంలో జిల్లా నాలుగవ స్థానంలో ఉందని గుట్టలపై , కాలువలు, బండ్స్, ప్రభుత్వ భూముల్లో మొక్కలను నాటాలన్నారు. లక్ష్యాన్ని ఈ నెల 15లోగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ నీతూప్రసాద్ మాట్లాడుతూ సీజనల్ వ్యాదులు ప్రబలకుండా ఉండేందుకు యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉంచడం జరిగిందన్నారు. గ్రామాల్లో పారిశుద్ద్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గోదావరి అంత్య పుష్కరాల సందర్బంగా ధర్మపురి, కాళేశ్వరంలలో స్నానాలకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలని, పారిశుద్ద్య చర్యలు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శ్రీదేవసేన, జగిత్యాల సబ్ కలెక్టర్ శశాంక, ఆర్డీఓలు, తహశీల్దార్‌లు, డిఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ రాజేశం, పిహెచ్‌సిల డాక్టర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఉపముఖ్యమంత్రి కలెక్టరేట్‌లో మొక్కలను నాటారు.