కరీంనగర్

2013 చట్టం ప్రకారమే పరిహారం చెల్లించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఆగస్టు 4: ప్రాజెక్టుల నిర్మాణం కోసం వివిధ ప్రాంతాల్లో సేకరించిన భూములను 2013 భూ సేకరణ చట్టం ప్రకారమే నష్టపరిహారం చెల్లించాలని టిడిపి జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం స్థానిక టిడిపి కార్యాలయంలో పార్టీ కరీంనగర్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయరమణారావు మాట్లాడుతూ మల్లన్న సాగర్ ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాంతాల్లోని ప్రాజెక్టుల నిర్మాణాలకు అవసరమైన భూములను 123 జిఓ కింద సేకరించడాన్ని రాష్ట్ర హైకోర్టు తప్పుబడుతూ సదరు జిఓను రద్దు చేసిన దరిమిలా ఇప్పటికే కాళేశ్వరం, గౌరవెల్లి, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల తదితర ప్రాంతాల్లో చేపట్టే సాగునీటి ప్రాజెక్టుల కోసం 123 జిఓ ప్రకారం సేకరించిన భూములకు 2013 భూ సేకరణ చట్టం కింద నష్టపరిహారం చెల్లించి భూ నిర్వాసితులందరికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 123 జిఓపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టు అని పేర్కొన్నారు. వైస్‌ఛాన్సలర్ల నియామకంలోను హైకోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురైన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. హైకోర్టు అనేక పర్యాయాలు మొట్టికాయలు వేస్తున్నా సర్కార్ తన వైఖరి మార్చుకోవడం లేదని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, సిఎం కెసిఆర్ తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నియంతలా పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని, ఇందుకోసం కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ తాజోద్దీన్, నగర అధ్యక్షుడు కళ్యాడపు ఆగయ్యలు సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు రొడ్డ శ్రీనివాస్, నాగుల బాలాగౌడ్, శివరామకృష్ణయ్య, బాల్ రెడ్డి, అనసూర్య నాయక్, వామి, రమేష్, హయగ్రీవాచారి పాల్గొన్నారు.