కరీంనగర్

గ్రూప్ 2, కానిస్టేబుల్ పరీక్షల వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, మార్చి 26: గ్రూప్ 2,కానిస్టేబుల్ పోటీపరీక్షలకు హాజరుకాబోతున్న అభ్యర్థులకు ఊరట లభించింది. పరీక్షలకు సిద్దమయ్యేందుకు గడువుసరిపోవటం లేదంటూ అభ్యర్థులు గతకొంతకాలంగా చెందుతున్న ఆందోళనకు తోడు, ఉద్యోగాల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించి, ఏప్రిల్ 23,24 తేదీల్లో నిర్వహించాల్సిన గ్రూప్ 2 పరీక్షను రెండు నెలలపాటు వాయిదా వేస్తూ శనివారం ప్రకటన వెలువరించింది. అలాగే, కానిస్టేబుల్ ఏప్రిల్ 3న జరగాల్సిన కానిస్టేబుల్ రాతపరీక్ష కూడా వాయిదావేస్తున్నట్లు ప్రకటించింది. ఇదేరోజు రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు కూడా నియామకపరీక్ష నిర్వహిస్తుంది. అత్యధికమంది అభ్యర్థులు రెండింటికి ధరఖాస్తులు చేసుకున్నారు. ఈనేపథ్యంలోకేంద్ర నియామక పరీక్షలు జరుగుతున్న తేదీల్లో రాష్ట్ర నియామక పరీక్షలు నిర్వహించవద్దనే నిర్ణయానికి తోడు, రెండు పరీక్షలకు అభ్యర్థులు హాజరయ్యే అవకాశం కల్పించేందుకు కానిస్టేబుల్ పరీక్ష వాయిదావేస్తున్నట్లు అధికారులు తెల్పుతున్నారు. కాగా, 60రోజులపాటు గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడటంతో అభ్యర్థులు మరింత పకడ్బంధీగా పరీక్షకు సన్నద్దమయ్యేందుకు అవకాశం లభించినట్లవగా, వారిలో హర్షం వ్యక్తమవుతోంది.