కరీంనగర్

టెక్స్‌టైల్ పార్కులో అగ్ని ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, ఆగస్టు 28: సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్కులో అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం మధ్యాహ్నం బద్దెనపల్లిలోని టెక్స్‌టైల్ పార్కులోని తుక్కు గోదాములో షార్కు సర్క్యూట్ వల్ల జరిగిన ఈ ప్రమాదంలో సుమారు రూ.25 లక్షల మేరకు ఆస్తి నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. గోదాములోని మూడు తుక్కు మిషనరీలు, భవనం, తుక్కు నిల్వలు ఆగ్నికి ఆహుతయ్యాయి. ఆదివారం కావడంతో పార్కులో యూనిట్లు మూసి ఉండడడంతో జన సంచారం లేరు. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో తుక్కు లోడ్ అన్‌లోడ్ చేసిన కొద్ది సమాయానికే అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఈ సమయంలో గోదాముకు సంబంధించిన యజమానులు అందుబాటులో లేకపోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి గోదాము షట్టర్లను పగుల కొట్టారు. అనంతరం ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పారు. పార్కులో నీటి కొరత కారణంగా బయట నుండి రెండు సార్లు ఫైర్ ఇంజన్ నీటిని నింపుకుని వచ్చి మంటలను ఆర్పడానికి యత్నించింది. అయితే మంటలు చాలా సమయం వరకు అదుపులోకి రాకపోవడంతో మంటలు అలాగే చెలరేగాయి. టెక్స్‌టైల్ పార్కులో అగ్ని ప్రమాదానికి గురైన యూనిట్ తడిగొప్పుల జయరాంకు చెందగా ఆయన మేర్గు ఎల్లప్ప అనే వ్యక్తికి ఇటీవలే అమ్ముకున్నాడు. అయితే మిషన్లు లేకుండా ఖాళీగా ఉన్న యూనిట్ భవనంను ఎల్లప్ప సిరిసిల్లకు చెందిన నాగారం వెంకటేశ్‌కు అద్దెకు ఇవ్వడంతో ఆయన అందులో వస్త్ర పరిశ్రమల్లో వచ్చిన దారం తుక్కు గోదాముకు వినియోగిస్తున్నాడు. తుక్కును కట్ చేయడానికి మూడు ప్రెస్సింగ్ మిషన్లు అందులో ఉంచాడు. తాజాగా అగ్నిప్రమాదం జరుగడంతో సుమారు ఒక్కో మిషన్ మూడు లక్షల విలువ చేస్తుండగా మూడు మిషన్లు కాలిపోయాయి. అలాగే మరో మూడు లక్షల మేరకు తుక్కు నిలువలు బుగ్గి పాలు కాగా మంటల తాకిడికి భవనం గోడలు కూడా పగుళ్ళు వచ్చి వినియోగానికి రాకుండా పోయింది. భవనం సుమారు పది లక్షల మేర ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం గోదాము నిర్వహిస్తున్న వెంకటేశం బీవాండికి వెళ్ళగా ప్రమాదం జరుగడంతో అధికారులే ఇక్కడ మంటల నియంత్రణలో నిమగ్న మయ్యారు. అయితే ఒక్కో ప్రెస్సింగ్ మిషన్‌లో 70 లీటర్ల మేర ఆయిల్ ఉంటుందని, ఈ కారణంతోనే మంటలు తీవ్రంగా చెలరేగి ఆదుపులోకి రాలేకపోయినట్టు చెబుతున్నారు. కాగా రెవెన్యూ అధికారులు సంఘటన స్థలం వద్దకు వచ్చి పర్యవేక్షించారు.