అనంతపురం

లేపాక్షి ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి చాటుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లేపాక్షి, ఫిబ్రవరి 26 : విజయనగర రాజుల కాలంలో నిర్మించి... శిల్పకళా కాణాచిగా పేరొందిన లేపాక్షి ప్రాశస్త్యాన్ని ప్రపంచ దేశాలకు చాటేవిధంగా నంది ఉత్సవాలను నిర్వహిద్దామని పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. శుక్రవారం నంది విగ్రహం నుంచి గురుకుల పాఠశాల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాయలు ఏలిన రాయలసీమలో వజ్రం లాంటి లేపాక్షి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామన్నారు. లేపాక్షిని ప్రపంచ పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా మారుస్తామన్నారు. వరల్డ్ హెరిటేజ్‌లో లేపాక్షిని చేర్చడానికి ప్రయత్నాలు చేస్తామన్నారు. ప్రపంచంలో అతిపెద్ద నంది విగ్రహం ఉన్న లేపాక్షిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయడంతోపాటు అభివృద్ధి పనులు చేస్తోందన్నారు. గతంలో లేపాక్షి నంది ఉత్సవాలను తూతూమంత్రంగా నిర్వహించి చేతులు దులుపుకునేవారని, అయితే తమ ప్రభుత్వం ప్రపంచ దేశాలకు లేపాక్షి చరిత్ర తెలిసేలా ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు. నాటి పాలకులు లేపాక్షి అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ ఆధ్వర్యంలో ఇప్పటికే రూ.5 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం హైదరాబాద్‌ను ఏ విధంగా అభివృద్ధి చేసిందో హిందూపురం నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ అంతకుమిన్నగా అభివృద్ధి చేస్తారని అంబికా కృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిసి కార్పొరేషన్ చైర్మన్ పామిశెట్టి రంగనాయకులు, టిడిపి నేతలు పరిటాల శ్రీరామ్, దేమకేతేపల్లి అంజినప్ప, డిఇఓ అంజయ్య, ఆర్డీఓ రామ్మూర్తి, పౌర సంబంధాల అధికారి తిమ్మప్ప, మార్కెట్‌యార్డు చైర్మన్ క్రిష్టప్ప, నియోజకవర్గ ఇన్‌చార్జి శేఖర్, ఎంపిపిలు హనోక్, నౌజియాభాను, జడ్పీటీసీ ఆదినారాయణరెడ్డి, సర్పంచ్ జయప్ప తదితరులు పాల్గొన్నారు.
కల్తీ ఆహారం తిని విద్యార్థులకు అస్వస్థత
పుట్టపర్తి, ఫిబ్రవరి 26: కల్తీ ఆహారం తిని సుమారు 27మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన పుట్టపర్తి మండలం జగరాజుపల్లిలోని కస్తూరిబా పాఠశాలలో చోటు చేసుకుంది. గురువారం రాత్రి 10గంటల సమయంలో సదరు పాఠశాలలోని విద్యార్థులు భోజనం అనంతరం వాంతులు, విరేచనాలు, అస్వస్థతకు గురికావడం జరిగింది. తోటి విద్యార్థులు సమాచారం మేరకు పాఠశాల ఎస్‌ఓ సౌభాగ్య, సిబ్బంది పుట్టపర్తిలోని సత్యసాయి జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై శుక్రవారం పుట్టపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి నాగరాజు నాయక్ ఆధ్వర్యంలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి అస్వస్థతకు గురైన విద్యార్థులకు వైద్యచికిత్సలు అందజేశారు. 200మంది విద్యార్థులు కల్గిన ఈ కస్తూరిబా పాఠశాలలో విద్యార్థులకు ముగ్గిన బియ్యం, ఉడికీ ఉడకని అన్నం, కూరలు, ముగ్గిన బిస్కెట్లు తరచూ ఆహారంగా ఇస్తున్నట్లు విద్యార్థులు వాపోయారు. సిసిడి వాణిదేవి, తహశీల్దార్ సత్యనారాయణ, ఎంఈఓ నెట్టికంటయ్య, సిపిఐ నాయకుల ముందు విద్యార్థులు తమ సమస్యలను వ్యక్తపరిచారు. 200మంది విద్యార్థులుంటే కేవలం 100కోడిగ్రుడ్లనే ఇవ్వడం, ముగ్గిన బియ్యంతో అన్నాన్ని వండి పెట్టడం, ఒకే కూరను వడ్డించడం, వారానికి ఒకరోజు టీ ఇవ్వడం, మెనూను ఏమాత్రం పాటించకపోవడం, సాయంత్రం 5గంటలకు వంటవారు వండివార్చిన అన్నాన్ని రాత్రి పొద్దుపోయాక భుజించాల్సి రావడం వంటి తమ సమస్యలను అధికారుల ముందు వెల్లబోసుకున్నారు. కేవలం అజాగ్రత్త వల్లనే కల్తీ ఆహారం కారణంగా అస్వస్థతకు గురైనట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతు ఇటువంటి సమస్యలు తిరిగి తలెత్తకుండా చూడాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకోవాల్సి వుంటుందని వారు హెచ్చరించారు. ఈ సందర్భంగా సిపి ఐ నాయకులు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడే ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండు చేశారు.
భూమి కంటే పెద్దవాడు
బూదిగుమ్మ సంజీవరాయుడు
* నేటి నుండి తిరునాల
బెళుగుప్ప, ఫిబ్రవరి 26:్భమికన్న పెద్దవాడు బూదిగుమ్మ సంజీరాయుడ (ఆంజనేయస్వామి) అని నానుడి, స్వామి వారి తిరునాళ ఉత్సవం ప్రతి సంవత్సరం మాఘమాసం మూడవ శని, ఆదివారాలలో బూదిగుమ్మ సంజీరాయుని తిరునాల ఉత్సవాలు నిర్వహించడం అచారం. మండల పరిధిలోని రామసాగరం గ్రామంలో పెన్నానది తీరంలో వెలసిన శ్రీ సంజీవరాయుడు స్వామి చోళరాజుల కాలంలో శ్రీకృష్ణ దేవరాయల గురువు వ్యాసరాయలు చేత ప్రతిష్ఠితమైన ఆంజనేయస్వామి భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా బూదిగుమ్మ ఆంజనేయస్వామిగా వెలుగొందుచున్నాడు. ఆందువల్లే స్వామి వారిని దర్శించుకోవడానికి జిల్లాలోని రాయదుర్గం, కర్నాటక ప్రాంతాల నుండి పెద్దఎత్తున భక్తులు విచ్చేసి స్వామి వారిని దర్శించుకుంటుంటారు. ప్రతి ఏట మాఘ మాసంలో జరిగే తిరునాల ఉత్సవంలో పాల్గొని, పెన్నానదిలో మాఘ స్నానం ఆచరిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయన్నది భక్తుల ప్రగాడ నమ్మకం,
ఆలయ చరిత్ర
క్రీస్తు పూర్వం 400 ఏళ్ల చరిత్ర కల్గిన శ్రీ బూదిగుమ్మ ఆంజనేయస్వామి దేవాలయంలో చోళరాజుల కాలంలో వ్యాసరాయలు చేత ప్రతిష్టించిన ఆలయ పరిసర ప్రాంతమే బూదిగుమ్మ గ్రామం, అప్పట్లో ప్రజలు స్వామి వారి కృపాకటాక్షాలతో ప్రజలు సుఖ సంతోషాలతో వుండేవారు. గ్రామం చుట్టూ ఉన్న కోట గోడకు కంచు కోట వాకిలి ద్వారం గుండ ప్రవేశించే వారు. కోట గోడలపై చుట్టూ శత్రురాజుల రక్షణ కోసం బురుజులు వుండేవని, శిథిలావస్థకు చేరుకున్న రూపాలు దర్శనమిస్తాయి. అప్పట్లో మొదటి కలెక్టర్ సర్ తామస్ మన్రో దేవాలయాన్ని దర్శించుకుని నిత్యపూజలకు విరాళంగా రూ.51 ఇచ్చిన ఆధారాలు నేటికి ఉన్నాయి. అప్పట్లో భయంకరమైన ప్లేగువ్యాధి వ్యాపించింది. దానికి నివారణ లేక ప్రజలు వరుస పట్టి మృతి చెందేవారని, శవాలను పెన్నానదిలో గుట్టలుగా వేశారని పెద్దలు చెబుతుంటారు. గ్రామంలో ఆశాంతి నెలకొని, భయాందోళనలకు ప్రజలు గురయ్యారని, అదును చూసుకుని శతృ రాజులు సర్వాన్ని దోచుకున్నారు. దీంతో భయంతో ఆలయాన్ని పరిసర ప్రాంతాన్ని వదిలి మూడు కిలో మీటర్‌ల దూరంలో నివాసాలు ఏర్పరుచుకుని జీవనం సాగించారు. అదే నేటి రామసాగరం గ్రామం. ఇప్పటికీ ప్రభుత్వ గెజిట్‌లో బూదిగుమ్మ గ్రామంగా ఉంది. స్థలమార్పిడితో ప్రజల జీవన విధానం మెరుగుపడి సంజీవరాయస్వామి తిరిగి కొలవడం మొదలు పెట్టారని, అప్పటి నుండి రామసాగరం ప్రజలు స్వామి వారికి నిత్యపూజలు అందచేస్తున్నారు.
నేడు రథోత్సవం
మాఘ మాసం మూడవ శనివారం పురస్కరించుకుని స్వామి వారి తిరునాల కార్యక్రమంలో బాగంగా బూదిగుమ్మ ఆంజనేయస్వామి రథోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఉదయం స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, ఆకుపూజ, వివిధ భక్తులు స్వామి వారికి సమర్పించి మొక్కుబడులు తీర్చుకుంటారు. ఆదివారం తెల్లవారుజామున భక్తులు మాఘ స్నానం ఆచరించి సిద్ధేశ్వరస్వామి ఘాట్ వద్ద పూజలు చేసి అనంతరం సంజీవరాయస్వామిని దర్శించుకుంటారు. అలాగే సంజీవరాయస్వామి ఉత్సవాలతో పాటు శ్రీ పద్మావతి, వెంకటరమణస్వామి ఉత్సవాలు సైతం ఘనంగా నిర్వహించటానికి దేవాదాయశాఖ అధికారి ఈశ్వరరెడ్డి ఆలయ ధర్మకర్తలు ఎర్రిస్వామి, శ్రీనివాసులు, ప్రధాన అర్చకులు జ్ఞానేశ్వర్, పండితులు జయన్నస్వామి, గ్రామపెద్దలు ఎత్తున సన్నాహాలు చేపట్టారు.
లేపాక్షి నుంచే నియోజకవర్గ అభివృద్ధి
* ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
లేపాక్షి, ఫిబ్రవరి 26 : ప్రముఖ పర్యాటక కేంద్రం లేపాక్షి నుంచే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. నంది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన విద్యార్థుల ర్యాలీ అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని నియోజకవర్గాల తరహాలోనే హిందూపురానికి కూడా నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అయితే తన శ్రేయోభిలాషులైన దాతలు ఎక్కువ అభివృద్ధికి దోహదపడుతున్నారన్నారు. ఇందులో భాగంగానే క్యాన్సర్ ఆసుపత్రికి పలువురు దాతలు నిధులు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు. ఇటీవలే దాతలు, శ్రేయోభిలాషుల నుంచి రూ.6.50 కోట్ల నిధులు సేకరించినట్లు తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధిలో సైతం పలువురు దాతల భాగస్వామ్యం కావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కాగా ఈనెల 24న కొడికొండ చెక్‌పోస్టు నుంచి లేపాక్షి ఉత్సవాలకు నాంది పలికామన్నారు. కలెక్టర్ కోన శశిధర్ మాట్లాడుతూ లేపాక్షి నంది ఉత్సవాల సందర్భంగా ఆలయం తూర్పు ద్వారం వైపున ఉన్న పెద్ద గుంతను పూడ్చడంతోపాటు జఠాయువు విగ్రహం ప్రతిష్ఠించనున్న గుట్ట చుట్టూ మట్టి రోడ్డు నిర్మాణ పనులు పూర్తయినట్లు తెలిపారు. అదేవిధంగా వివి గిరి రోడ్డు, కోనేరు, జఠాయువు ఘాట్‌లకు బిట్‌రోడ్డు నిర్మాణ పనులు సైతం పూర్తి చేసినట్లు తెలిపారు. నంది ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సినీ, సంగీత కళాకారులు హాజరవుతున్నట్లు తెలిపారు. ఎస్పీ రాజశేఖర్‌బాబు మాట్లాడుతూ నంది ఉత్సవాలకు ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా 2 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని ముఖ్య కూడళ్లలో పోలీసు పహారా ఉంటుందన్నారు. లేపాక్షి ఉత్సవాలను ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.
రైతుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
* జడ్పీ చైర్మన్ చమన్‌సాబ్
మడకశిర, ఫిబ్రవరి 26 : రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నారని జిల్లా పరిషత్ చైర్మన్ చమన్‌సాబ్, టిడిపి జిల్లా అధ్యక్షులు బికె పార్థసారథి అన్నారు. శుక్రవారం మడకశిర మార్కెట్‌యార్డు చైర్మన్‌గా వెంకటరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు, రైతులను అన్ని విధాలా అభివృద్ధి చేయడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనుల చూసి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుండటం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అనంతపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి వహిస్తున్నారన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా రైతు రుణమాఫీ చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. హంద్రీనీవా కాలువ ద్వారా త్వరలోనే అన్ని చెరువులకు నీటిని అందించనున్నట్లు తెలిపారు. పండ్ల తోటల పెంపకానికి 50 శాతం రాయితీతో వ్యవసాయ పరికరాలు అందజేస్తున్నట్లు తెలిపారు. మార్కెట్‌యార్డుల ద్వారా రైతులు పండించిన ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా మార్కెట్ యార్డుల్లో విక్రయించుకోవాలన్నారు. స్థానిక మార్కెట్‌యార్డులో అన్ని రకాల వ్యాపార లావాదేవీలు నిర్వహించే విధంగా పాలకవర్గ సభ్యులు, అధికారులు చొరవ తీసుకోవాలని, అందుకు తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు. నూతన మార్కెట్‌యార్డు చైర్మన్ వెంకటరామయ్య మాట్లాడుతూ మడకశిర మార్కెట్‌యార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం మార్కెట్‌యార్డు అధికారి తిరుపాల్‌నాయక్ నూతన పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ఎమ్మెల్యే ఈరన్న, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
సామూహిక వివాహాలకు సిఎం
* ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పరిటాల సునీత
రామగిరి, ఫిబ్రవరి 26: పరిటాల మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏప్రిల్ 21న ఉచిత సామూహిక వివాహాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించేందుకు మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ శుక్రవారం సాయంత్రం తిరుమల దేవర ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి రానుండడంతో అందుకు హెలీప్యాడ్ స్థలాన్ని పరిశీలి ంచారు. అక్కడి నుండి కల్యాణవేదిక వరకు రోడ్డు విస్తరణ, బందోబస్తుపై చర్చించారు. కల్యాణవేదిక ఏర్పాటు చేస్తే నూతన దంపతులను ముఖ్యమ ంత్రి ఆశీర్వదించేందుకు అనుకూలం గా ఏర్పాట్లు చేపట్టనున్నారు. అంతేకాకుండా గంగంపల్లి వద్ద నుండి ఆల యం వరకు రోడ్డు విస్తరణ పనులను చేపట్టాలని చర్చించారు. భోజన ఏర్పా ట్లు, వచ్చే జనాల కోసం విడిది ఏర్పాట్లను చేసేందుకు స్థలాన్ని పరిశీలించా రు. అంతేకాకుండా తిరుమల దేవర ఆలయాన్ని ముస్తాబు చేసేందుకు రం గుల అద్దకంపై కూడా చర్చించారు. వీ లైనంత త్వరగా పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఉచి త సామూహిక వివాహాల నమోదు వెంకటాపురంలో చేపడుతున్నారు. మార్చి 31వరకు కూడా సామూహిక వివాహాల పేర్ల నమోదు కూడా వుం టుంది. ఈ సామూహిక వివాహాలపై టిడిపి నాయకులు, కార్యకర్తలు, పరిటాల అభిమానులు విస్తృత ప్రచారం నిర్వహించాలని కోరారు.
‘ప్రాజెక్టు అనంత’పై 29న వర్క్‌షాప్
* డిసిసి అధ్యక్షుడు కోటా సత్యం
పుట్టపర్తి, ఫిబ్రవరి 26: ప్రాజెక్టు అనంతపై ఈ నెల 29న జిల్లా కేంద్రంలో అవగాహన సదస్సు, వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనంతపురం రైతాంగాన్ని సంక్షోభం నుండి గట్టెక్కించడం, బలవన్మరణాలు, ఆత్మహత్యలకు గురికాకుండా కాపాడేందుకు రూపొందించినదే ప్రాజెక్టు అనంత అని అన్నారు. 2012న రైతులు, రైతు సంఘాలను, ఎన్‌జిఓలను జిల్లా అధికారులతో సమాలోచన చేసి రూ.6660కోట్లతో ఒక సమగ్రమైన ప్రాజెక్టును ఐసిఏఆర్ డైరెక్టర్ అయ్యప్పన్ నేతృత్వంలో తయారు చేయడం జరిగిందన్నారు. ఆనాటి ప్రతిపక్ష టిడిపి ఎమ్మెల్యేలు, ఇతరులతో సైతం సమాలోచన చేసి ప్రాజెక్టును రూపొందించడం జరిగిందన్నారు. జిల్లా రైతులకు వరప్రదాయిని అయిన ప్రాజెక్టు అనంతను ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం పక్కన పెట్టడం శోచనీయమన్నారు. భయంకరమైన కరువు, ఆత్మహత్యలు, వలసలు వెళ్తున్న ఈ తరుణంలో ఈ ప్రాజెక్టు ఆవశ్యకతపై అవగాహన సదస్సు, వర్క్‌షాపును నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమైందన్నారు. పిసిసి కార్యదర్శులు, అనుబంధ సంఘాలు, జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు, నియోజకవర్గాల, మండల పార్టీ సభ్యులు, కమిటీ సభ్యులు హాజరై ఈ వర్క్‌షాపును అనంతపురంలోని రుద్రంపేట వద్ద రాయల్ ఫంక్షన్ హాల్‌లో జరుగునని, దీనిని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
నేడు కదిరికి సైన్స్ రైలు రాక

కదిరి,్ఫబ్రవరి 26: పట్టణంలోని రైల్వే స్టేషన్‌లో నేటి నుంచి మూడు రోజుల పాటు సైన్స్ రైలు వుండి విద్యార్థులకు సైన్స్ పట్ల ఆసక్తి అదే విధంగా పలు ప్రయోగాలు, నమూనాలు తయారికి ప్రోత్సహించడం కోసం ఈ సైన్స్ రైలు ప్రదర్శన ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ సైన్స్ రైలులో అనేక ప్రయోగాలకు సంబంధించిన అంశాలతో కూడిని ప్రదర్శనలు కళ్ళకు కట్టినట్లు చూపుతున్నారు. రాయల సీమకు సంబంధించి కేవలం రెండు రైల్వే స్టేషన్‌లో మాత్రం ఈ ప్రదర్శన అవకాశము కల్పించడం జరుగుతోందని, రైల్వే శాఖ, రాష్ట్ర విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే కర్నూలు జిల్లా ఆదోనిలో మూడు రోజుల పాటు ప్రదర్శన ముగించుకొని నేడు(శనివారం) కదిరి చేరుకుంది. కాగా మూడు రోజుల పాటు కదిరిలో ఏర్పాటు చేయనున్న ఈ సైన్స్ రైలు ప్రదర్శన సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చే వేలాది మంది విద్యార్థులకు భోజన, అల్ఫహారం సదుపాయాన్ని స్థానిక మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కల్పించడం జరుగుతోందని కదిరి ఎంఈఓ కె చెన్నకృష్ణ, నల్లచెరువు ఎంఈఓ విజయ్‌కుమార్‌లు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు ప్రదర్శన వుంటుందన్నారు. ఇందుకు సంబంధించి కదిరి ప్రాంత విద్యార్థులే గాక ఇతర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు సైతం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సైన్స్‌లో గల సాంకేతిక అభివృద్ధిని తెలుసుకోవచ్చన్నారు.

రీజియన్‌లో ఆర్టీసీకి
రూ.132 కోట్ల నష్టం

* ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామారావు
మడకశిర, ఫిబ్రవరి 26 : కడప ఆర్టీసీ రీజియన్ పరిధిలోని 31 డిపోల్లో గత జనవరి నాటికి రూ.132 కోట్ల నష్టాల్లో ఉన్నట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామారావు తెలిపారు. శుక్రవారం స్థానిక ఆర్టీసీ డిపోను తనిఖీ చేసి సర్వీసులు, సిబ్బంది పనితీరు, ఆదాయం, వ్యయం తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలోని అనంతపురం, హిందూపురం, కళ్యాణదుర్గం, తాడిపత్రి డిపోల్లో రూ.6 కోట్ల మేర నష్టాల్లో ఉండగా మడకశిర డిపోలో ప్రస్తుతం రూ.3 కోట్ల వరకు ఉన్నట్లు తెలిపారు. ఖర్చులు బాగా తగ్గించి ఆదాయాన్ని పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ చివరి నాటికి అనంతపురం జిల్లాకు 102, కడపకు 38, కర్నూలుకు 46 చొప్పున హయ్యర్ బస్సులు వస్తున్నాయని తెలిపారు. ఆయా బస్సుల్లో ప్రయాణికుల వినోదం కోసం టివిలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డ్రైవర్లు, కండక్టర్లు ఆదాయాన్ని పెంచే విధంగా తగిన అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికుల సౌకర్యార్థం మరిన్ని సర్వీసులను నడపుతామన్నారు. ఆయన వెంట హిందూపురం డిపో మేనేజర్ గోపినాథ్ ఉన్నారు.

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

అనంతపురంటౌన్, ఫిబ్రవరి 26:రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక సప్తగిరి సర్కిల్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్థానిక కాంగ్రెస్ భవన్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు దిష్టిబొమ్మను ఊరేగించారు. ఈ కార్యక్రమం లో డిసిసి అధ్యక్షుడు కోటాసత్యం, దాదాగాంధీ, కొండారెడ్డి, రమేష్, సత్యనారాయణ, రామాంజనేయులు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే జోన్ ఏర్పాటు చేస్తారని అందరూ ఆశించారన్నారు. అయితే వైజాగ్ రైల్వేజోన్ ఏర్పాటు విషయమై రైల్వే బడ్జెట్‌లో నామమాత్ర ప్రతిపాదన కూడా లేకపోవటం రాష్ట్ర ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. రైల్వే జోన్ ఏర్పాటు వలన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరగటంతోపాటు రైలు ప్రయాణసౌకర్యాలు మెరుగుపడతాయన్నారు. కేంద్ర రైల్వే బడ్జెట్ ప్రజలపై ఆర్థికభారాలను మోపటంతోపాటు సంక్షేమానికి తిలోదకాలిచ్చిందన్నారు. రైలు ప్రయాణా న్ని భారంగా మార్చేందుకు యత్నించిందన్నారు. రైల్వేబడ్జెట్ రాష్ట్ర ప్రజల పాలిట గుదిబండగా మారిందని ధ్వజమెత్తారు. తర్వాత దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు.
రాయలసీమ బస్సుయాత్రను జయప్రదం చేయండి
అనంతపురం కల్చరల్, ఫిబ్రవరి 26: రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాలని, విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కోరుతూ సిపిఎం,సిపిఐల ఆధ్వర్యంలో జరుగుతున్న బస్సుయాత్రను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ ప్రకటన ద్వారా శుక్రవారం తెలిపారు. ఈనెల 20న తిరుపతిలో ప్రారంభమైన బస్సుయాత్ర మార్చి 5న కర్నూలులో ముగుస్తుందన్నారు. నేడు జిల్లాలో ప్రవేశిస్తున్న బస్సుయాత్రను జిల్లా ప్రజలు జయప్రదం చేయాలని ఆయన కోరారు. బస్సుయాత్రలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాసులు, సిపిఐ రాష్ట్ర నాయకులు ఓబులేసు, రాయలసీమ అభివృద్ధి సబ్‌కమిటీ కన్వీనర్ ఓబులు పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు. రాయలసీమ అభివృద్ధి పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, జిల్లాలోని 63 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించినప్పటికీ కరవు నివారణా చర్యలు చేపట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయన్నారు. ప్రభుత్వ చర్యలను ఎండగడుతూ ప్రజలను చైతన్య పరచి సమస్యలపై పోరాటాలకు సిద్ధం చేయడానికి బస్సుయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా మార్చి 15న చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

భక్తిశ్రద్ధలతో లక్ష పుష్పాభిషేకం
అనంతపురం కల్చరల్, ఫిబ్రవరి 26: నగరంలోని రైల్వేఫీడర్ రోడ్డు శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం శ్రీవారికి లక్ష పుష్పాలతో అభిషేకం నిర్వహించారు. మాఘమాసం సందర్భంగా శ్రీవారికి లక్ష పుష్పాభిషేకం నిర్వహించడం ఆలయంలో ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. బెంగుళూరు నుండి తెప్పించిన వివిధ రకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు కెఎల్‌ఎన్.శాస్ర్తీ, ఆలయ కమిటీ సభ్యులు గుప్తా, సత్యనారాయణ, నాగరాజు, విశ్వనాథ్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.