సంపాదకీయం

ప్రగతికి గీటురాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన స్థూల జాతీయోత్పత్తి సాలీనా సగటున ఎనిమిది శాతం పెరగడానికి రంగం సిద్ధం కావడం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్న పరిణామం. గత ఆర్థిక సంవత్సరం -2015-16- చివరి మూడు నెలల్లో ఈ ఉత్పత్తి దాదాపు ఎనిమిది శాతం ప్రగతిని సాధించిందట. మొత్తం మీద గత సంవత్సరం ఏడున్నరశాతానికి పైగా స్థూల జాతీయ ఉత్పత్తులు పెరిగిపోవడం ప్రపంచంలోని మరేదేశంలోను సంభవించని అద్భుతం. ప్రపంచలో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించడానికై దూసుకువెళుతున్న చైనాలోకంటె కూడా మనదేశంలో ఉత్పత్తి పెరుగుదల వేగవంతం కావడం అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు సైతం ప్రశంసిస్తున్న పరిణామం. సంపన్న దేశాలలో స్థూల జాతీయోత్పత్తి రెండు శాతం నుండి నాలుగు శాతం వరకు మాత్రమే సాలీనా పెరుగుతోందట. చైనా ఉత్పత్తి కూడా సగటున ఆరున్నర శాతం మాత్రమే సాలీనా అభివృద్ధి సాధిస్తోంది. చైనాకు మనదేశానికి వలె విదేశీయ వాణిజ్యంలో భారీలోటు లేదు. పోలిక పరిమితమైనది. ఏమయినప్పటికీ ఇలా స్థూల జాతీయ ఉత్పత్తి పెరుగుతుండడం మన ఆర్థిక ప్రగతికి తిరుగులేని సంకేతం. రెండేళ్లపాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని భారతీయ జనతాపార్టీ సాధించిన విజయాలకు ఈ స్థూల జాతీయ ఉత్పత్తి-జిడిపి- పెరుగుదల వౌలికమైన ఆధార భూమిక. జిడిపి పెరుగుదల మాత్రమే ఆర్థిక వ్యవస్థ సౌష్టవానికి ఏకైక ప్రతీక కాజాలదన్న వాదాలు కూడా మనదేశంలోను, విదేశాలలోను నిరంతరం వినబడుతున్నా యి. అందువల్ల సౌష్టవానికి ఏది ప్రధాన చిహ్నం అన్నది ఏకాభిప్రాయం కుదరని, సామాన్యులకు అవగాహన కుదరని మహా విషయం. ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం, రూపాయి విలువ పెరగడం, విదేశాలతో జరుగుతున్న వాణిజ్యంలో లోటు లేకపోవడం అవినీతి అంటని ఆర్థిక వాణిజ్య కలాపాలు కొనసాగడం వంటివి ఎన్నో ఆర్థిక సౌష్టవ నిర్ధారణకు దోహదం చేస్తున్నాయి ఆర్థిక వేత్తలు ఆర్థికవేత్తలుగా నిర్థారణలు చేసినప్పుడు సైతం అభిప్రాయ భేదాలు విశే్లషణలను నిర్థారణలు అపహసిస్తూనే ఉన్నాయి. ఆర్థికవేత్తలను రాజకీయం అలముకొన్నప్పుడు ఈ విభేదాలు మరింతగా విన్యాసాలను ప్రదర్శించడం సహజం. జిడిపి పెరుగుదల మాత్రమే ఆర్థిక ప్రగతికి సాక్ష్యం కాజాలదని గతంలో సర్వోన్నత న్యాయస్థానం కూడ వ్యాఖ్యానించి ఉంది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం ప్రధానమని రిజర్వ్ బ్యాంక్ నిర్వాహకులు జిపిడి పెరుగుదల ప్రధానమని ప్రభుత్వ నిర్వాహకులు పరస్పరం విభేదిస్తుండడం నడుస్తున్న చరిత్ర. మరోవైపు మనదేశపు ఆర్థిక వ్యవహారాలను నియంత్రించడానికి యత్నిస్తున్న విదేశీయ వాణిజ్య సంస్థలు వాటి దళారీలు విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తుండడం ప్రపంచీకరణ వల్ల దాపురించిన ప్రమేయం. స్వచ్ఛంద అంతర్జాతీయ ఆర్థిక సంస్థగా చెలామణి అవుతున్న మూడీస్ వంటివి నిజానికి బహుళ జాతీయ వాణిజ్య సంస్థల దళారీలు. ఏడుశాతం కంటె మించి జిడిపి పెరగడం వాంఛనీయం కాదని, అలా పెరిగినట్టయితే ద్రవ్యోల్బణం కూడ మితిమీరిన వేగవంతం అవుతుందని ఈ మూడీస్ 2013 మార్చి నెలలో మన ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఇలాంటి దళారీ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మనదేశంలోకి ప్రవేశించకుండా మనలను బెదిరించకుండా మన ప్రభుత్వాలు నిరోధించలేకపోవడం కూడ ప్రపంచీకరణలో భాగం.
రూపాయి విలువను సమకాల ద్రవ్యోల్బణ ప్రాతిపదికగా నిర్ధారించడం, గతంలోని ఒక సంవత్సరాన్ని ప్రాతిపదికగా నిర్ధారించడం రెండు పద్ధతులు. 2011 సంవత్సరం ప్రాతిపదికగా గత ఆర్థిక సంవత్సరలో మన జిడిపి పరిమాణం నూట పదమూడున్నర లక్షల కోట్ల రూపాయలని నిర్ధారణ జరిగింది. అంతకుముందు ఏడాది-2014-15వ సంవత్సరం-లో జరిగిన ఉత్పత్తి నూట ఐదున్నర లక్షలకోట్ల రూపాయలు. అందువల్ల పెరుగుదల ఏడున్నర శాతం కంటె ఎక్కువే. 2014 నాటి ధరలను విలువలను ప్రాతిపదికగా చేసుకున్నట్లయితే ఈ ఉత్పత్తుల పరిణామం మరింత పెరుగుతుంది. ఇలా పెరుగుదల శాతంలో మన అగ్రగాములమైనప్పటికీ పరిమాణంలో మన జిడిపి అమెరికా, చైనా, జపాన్ వంటి దేశాలకంటె చాలా తక్కువగానే ఉంది. మన జిడిపి 2014-15లోనే నూటముప్పయి లక్షలకోట్ల స్థాయికి చేరినట్లు గత జూలైలో నిర్ధారణ జరిగింది. 2007 నాటికి అరవై ఐదు లక్షల కోట్ల స్థాయికి చేరడానికి అరవైఏళ్లు పట్టిందట. తరువాతి ఏడేళ్లలోనే రెట్టింపయి నూట ముప్పయి లక్షల కోట్లకు చేరడం ప్రధానంగా ద్రవ్యోల్బణం ప్రభావం కావచ్చు. కానీ 2011 నాటి విలువల ప్రకారం 2014-15లో ఉత్పత్తి నూట ఐదున్నర లక్షల కోట్ల రూపాయలు మాత్రమేనని ఇప్పుడు నిర్ధారణ అయింది. ఇలాంటి నిర్ధారణలను అర్థం చేసుకొనడం సామాన్యులకు సాధ్యం కాకపోయినప్పటికీ జిడిపి పెరుగుతోందన్నది హర్షించ దగిన అంశం.
అరవై ఐదు లక్షల కోట్ల రూపాయల- ఒక ట్రిలియన్ అమెరికన్ డాలర్లు-స్థాయికి చేరడానికి అరవై ఏళ్ళు పట్టడం అన్న నిర్ధారణ కూడ సామాన్యుల బుర్రలకు అంతుపట్టని అంశం. అంటే అరవైఎళ్ల క్రితం మన జిపిపి విలువ ‘సున్న’ అన్నమాట. ఈ నిర్ధారణ ఎంత హాస్యాస్పదమో వివరించనక్కరలేదు. జిడిపి విలువ అరవై ఏళ్ల క్రితం ‘సున్న’ ఉన్నప్పుడు మాత్రమే అరవై ఏళ్లలో అరవై ఐదు లక్షల కోట్ల రూపాయల మేర ప్రగతి జరిగిందని చెప్పడానికి వీలుంది. కానీ అరవై ఏళ్ల క్రితం 1947లో కూడ జిడిపి విలువ ‘సున్న’ ఎలా ఉంటుంది? ఉండదు. ఎంతోకొంత మొత్తం జిడిపి ఉండి ఉంటుంది. స్వతంత్ర భారతదేశంలో తొలిసారిగా 2007లో మాత్రమే ఒక్క ట్రిలియన్ అమెరికా డాలర్ల స్థాయికి మన జిడిపి చేరిందని చెప్పడం ఆర్థిక విశే్లషకుల అసలు లక్ష్యం. ఇలా అమెరికా డాలర్ ప్రాతిపదికగా అభివృద్ధిని నిర్ధారించడం ప్రపంచీకరణ ప్రభావం మాత్రమే కాదు. ఆర్థిక భావదాస్య ప్రభావం కూడ..మనదేశ ప్రజలకు అర్థంకాని బిలియన్ డాలర్లలోను, ట్రిలియన్ డాలర్లలోను లెక్కలు చెప్పకపోయినట్లయితే మనకు అంతర్జాతీయ స్థాయి లేదన్న న్యూనత తొలగకపోవడం ఈ స్థితికి కారణం. బిలియన్ అంటే వందకోట్లని, ట్రిలియన్ అంటే లక్షకోట్లని, తెలియని వారు ఈ జిడిపి ప్రగతిని చూసి అర్థంకాని అద్భుత అనుభూతికి లోనవుతున్నారు. లక్షలలోను, కోట్లలోను రూపాయలలోను విలువలను వివరించే పద్ధతిని భారతీయ ఆర్థిక వేత్తలు అవలంబించాలి. కానీ మన ప్రజలకు అర్థం కావడం కంటె అంతర్జాతీయ సమాజానికి అవగతం కావడం ప్రధానమన్నది మన ఆర్థిక ప్రముఖుల అభిప్రాయం. ప్రపంచీకరణ అంటే ఇదే మరి. అందుకే మన జిడిపి పరిమాణం 2020 నాటికి ఐదున్నర ట్రిలియన్ అమెరికా డాలర్ల స్థాయికి చేరుతుందని ప్రచారం జరుగుతోంది. ట్రిలియన్లను కోట్లలోని డాలర్లను రూపాయిలలోకి మార్చి సామాన్యులకు వివరించడానికి నిపుణులు జుట్టు పీక్కోరు..అలా జుట్టు పీక్కోవడం సామాన్యుల పని..
ప్రాతిపదిక సంవత్సరం మారడం వల్ల కూడా జిడిపి వృద్ధిశాతంలో మార్పు రావడం మనదేశంలో ప్రచారమవుతున్న మరో మహా విషయం. 2004-05 ప్రాతిపదికన, 2014-15లో జిడిపి కేవలం 5.5 శాతం పెరిగింది. కానీ 2011 ప్రాతిపదిక సంవత్సరం అయ్యేసరికి 2014-15లో అభివృద్ధి ఏడుశాతం దాటిపోయింది. ఏమయినప్పటికీ ప్రపంచ దేశాల సగటు జిడిపి వృద్ధి సాలీనా నాలుగు శాతం కంటె తక్కువ..అందువల్ల మన ఏడున్నర శాతం వృద్ధి మనకెంతో ఘనం.