మహబూబ్‌నగర్

భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డులో 600 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాబూబ్‌నగర్, నవంబర్ 22: భవన నిర్మాణ కార్మికులను ఆదుకునేందుకే వెల్ఫేర్‌బోర్డును ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో రూ. 600 కోట్లు నిధులు ఉన్నాయని ఆ నిధులను వాడుకోవడంలో కార్మికులకు అవగాహన లేక నిధులు ఏళ్ల తరబడి మూలుగుతున్నాయని, వాటిని కార్మికులకు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర కార్మిక, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాలుగవ మహాసభకు మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, లక్ష్మారెడ్డిలు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మహాసభలో మంత్రి నాయిని నర్సింహరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవడానికి పుష్కలంగా నిధులు ఉన్నాయని, దాదాపు రూ.600కోట్లు వెల్పేర్ బోర్డులో అందుబాటులో ఉన్నాయని ఆయన పునరుద్ఘాటించారు. కార్మికులకు అవగాహాన లేని కారణంగా వెల్పేర్ బోర్డు నిబందనల ప్రకారం సభ్యత్వాలు ఉంటేనే చట్టంలో కల్పించిన హక్కులు అందుతాయని తెలిపారు. భవన నిర్మాణ కార్మికుడు ప్రమాద వశాత్తు చనిపోతే ఆకుటుంబానికి రూ.6లక్షల ఎక్స్‌గ్రేషియా వస్తుందని అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ ఎక్స్‌గ్రేషియాను రూ.10లక్షలకు పెంచడానికి పరిశీలిస్తుందన్నారు. మహిళాకార్మికులకు కాన్పుల సమయంలో రూ.20వేలు అందజేయడం జరుగుతుందని, అదేవిధంగా కార్మికుడి కుటుంబంలోఆడపిల్లల ఇద్దరు పెళ్లిలకు సైతం రూ.20వేలు ఇవ్వడానికి వీలుందని ఆయన వెల్లడించారు. వెల్పేర్ బోర్డులో ప్రతి పైసా కార్మికుడిదేనని నయాపైసా కుడా పక్కదారి పట్టకుండా, గల్లంతు కాకుండా చూసుకునే భాధ్యత తమదేనని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ ఎడాది వెల్పేర్ బోర్డు నుండి భవన నిర్మాణ కార్మికులకు రూ.76.81 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. మహాబూబ్‌నగర్ జిల్లాలోరూ.8.82 కోట్లు ఖర్చు చేయడం జరగిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం నాలుగు లక్షల మంది మాత్రమే భవన నిర్మాణ కార్మికులు వెల్పేర్ బోర్డు నిబందనల మేరకే సభ్యత్వాలు ఉన్నాయని ఇది చాలా తక్కువ అని, ఇది దురదృష్ట కరమని అన్నారు. ఇందులో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 1.14లక్షల మంది సభ్యత్వం కలిగి ఉన్నారని అన్నారు. ఈ సంఖ్య ఐదు లక్షల వరకు చేరాలని ఇక్కడ భవన నిర్మాణ కార్మికులు అధికంగా ఉంటారని ఆయన తెలిపారు. వచ్చే జనవరి నుండి రాష్ట్రంలోని 31 జిల్లాలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకడ్రైవ్ ఎర్పాటు చేసి లక్షలాది మంది కార్మికులను సభ్యత్వాలు చేయిస్తామన్నారు. ముఖ్యమంత్రి కెసీఆర్ కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో ఆలోచనలు చేస్తున్నాని తెలిపారు.్భవన నిర్మాణ కార్మకులకు ఇఎస్‌ఐ తో పాటు ఫించన్ సౌకర్యం కూడా కల్పించేందుకు పరిశీస్తున్నారన్నారు. సమైఖ్య రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని ప్రస్తుతం కెసిఆర్ తెలివైన వాడు కాబట్టి తెలంగాణలో మాత్రం అలా జరగకుండా చర్యలు చేపడ్తున్నారని తెలిపారు. అనంతరం ప్రమాదాల్లో మృతి చెంది కార్మికుల కుటుంబాలకు మంత్రులు చెక్కులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, కార్మక శాఖ కమీషనర్ అహ్మద్ నదీం తదితరులు పాల్గొన్నారు.