మహబూబ్‌నగర్

నల్లకుబేరులకు మోదీ వంత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, నవంబర్ 22: అధికారంలోకి వస్తే వంద రోజుల్లో నల్లధనాన్ని వెలికితీస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన మోదీ ఆ హామీని గాలికొదిలేసి నల్లకుబేరులకు వంత పాడుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థాయి బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ పెద్దనోట్లను రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నామని, కానీ దాని పర్యావసనాలను అంచనా వేయడంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. పెద్దనోట్లను రద్దు చేసే సమయంలో చిల్లర సమస్యలు వస్తాయనే అంచనాలతో దానికి తగ్గట్టు ఐదొందలు, వంద, యాభై తదితర నోట్లను అందుబాటులో ఉంచి, రద్దు చేసినట్లైతే దేశం ఈ సమస్యలు ఉండేవికావన్నారు. నల్లధనాన్ని వెలికితీసేందుకే పెద్దనోట్లను రద్దు చేశామని ప్రధానమంత్రి గొప్పగా చెప్పుకుంటున్నారని, కానీ ఈ ప్రకటన వచ్చిన తరువాత ఒక్క ధనవంతుడు కూడా బయటకు రాలేదని, పేదలు, మధ్య తరగతి ప్రజలే బజారుపాలై కుటుంబ సభ్యులంతా బ్యాంకుల వద్ద రాత్రింబవళ్లు నిలబడాల్సి వచ్చిందన్నారు. చిల్లర డబ్బుల కోసం ఆరాటపడి దేశవ్యాప్తంగా వందమందికి పైగా మృత్యువాతకు గురయ్యారని, దీనికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. పెట్టుబడిదారులు, ధనవంతులు కమీషన్లు చెల్లించి సులభంగా రద్దు చేసిన నోట్లను మార్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల వద్ద పెద్ద ఎత్తున నల్లధనం ఉందని, దమ్ముంటే వాటిని వెలికితీయాలని డిమాండ్ చేశారు. విదేశీ బ్యాంకులలో పెద్ద ఎత్తున నల్లధనం నిలువలు ఉన్నా వాటి జోలికి పోకుండా కేవలం రాజకీయ కారణాలతోనే దేశంలో ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. లక్షల కోట్లు బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకొని వాటిని తిరిగి చెల్లించకుండా దర్జాగా తిరుగుతుంటే మొండి బకాయిల పేరుతో దాదాపు 2.14 లక్షల కోట్లు రద్దు చేసి, సామాన్య ప్రజలు, రైతుల నుంచి మాత్రం ముక్కుపిండి వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలకు లోబడి పనిచేస్తూ ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని ఆయన విమర్శించారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత దేశవ్యాప్తంగా ఆర్‌ఎస్‌ఎస్, ఎబివిపి తదితర మతత్వ సంఘాలు దళితులపై దాడులకు పాల్పడుతున్నారని, గో సంరక్షణ పేరుతో మోదీ సొంత రాష్ట్రంలో సైతం దళితులపై దాడులు జరిగాయన్నారు. ఇలాంటి దాడులను సిపిఐ ఏమాత్రం సహించదన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైన సిపిఐ ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలపై అనునిత్యం పోరాటం నిర్వహిస్తుందని అన్నారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలుచేయకుండా ప్రజాసొమ్మును వివిధ పేర్లతో విచ్చలవిడిగా ఖర్చు చేస్తోందని ఆయన ఆరోపించారు.