మహబూబ్‌నగర్

బినామీ కాంట్రాక్టర్లను ఉపేక్షించేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, డిసెంబర్ 3: కాంట్రాక్టర్లు టెండర్లు వేసుకుని ఆ పనులను వారుచేయకుండా పర్సెంటేజీలకు అమ్ముకుని పనులను బినామీ కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని ఇలాంటి వ్యవస్థను ఉపేక్షించేది లేదని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. మహబూబ్‌నగర్ పట్టణంలో కోట్ల రుపాయల నిధులు ప్రభుత్వం మంజూరు చేసి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసిన పనులు జరగడం లేదని నవంబర్ 30వ తేదిన మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్లు ఆందోళన చేపట్టడంతో ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ కాంట్రాక్టర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. దాంతో శనివారం మహబూబ్‌నగర్ మున్సిపల్ సమావేశ మందిరంలో మున్సిపల్ చైర్ పర్సన్ రాధ ఆమర్, కమీషనర్ దేవ్‌సింగ్ నాయక్‌లు మున్సిపల్ కాంట్రాక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా టెండర్లు వేసి పనులు సొంతం చేసుకు న్న ప్రతి కాంట్రాక్టర్‌ను పనుల ఆలస్యంపై ఆరా తీశారు. వారందరికి ఫలాన తేదిలోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కాంట్రాక్టర్ల సమావేశంలో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. పనులు చేయాలంటే చేతులు తడపనిదే ఫైళ్లు కదిలే పరిస్థితి లేదని కాంట్రాక్టర్లు నేరుగా అధికారులను ప్రశ్నించా రు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ మహబూబ్‌నగర్ పట్టణాభివృద్ధి జరగాలంటే కాంట్రాక్టర్ల పాత్ర ఎంతో ఉందని వారిని పనులు చేయించే బాధ్యత ఇంజనీరింగ్ సిబ్బందిపై ఉందన్నారు. పనులు చేసిన వారం రోజుల వ్యవధిలో కాంట్రాక్టర్లకు బిల్లులకు సంబందించిన చెక్కులు ఇవ్వాల్సిందేనని తెలిపారు. టెండర్లు వేసుకుని పనులు పొందిన కాంట్రాక్టర్లు కొందరు పనులు చేయకుండా పట్టణాబివృద్ధికి తిలోదకం ఇస్తున్నారని మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం తెలంగాణలోనే ఆ దర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తుంటే కోట్ల రుపాయల పనులు చేయకుండా నాన్చుడు దోరణి అవలంబిస్తున్నారని ఇది దుర్మార్గమైన పని అన్నారు. ఈ నెల 22న రూ.163కోట్లతో మీషన్ భగీరథకు సంబందించిన లింక్ పైప్‌లైన్‌లు, నీటి ట్యాంకుల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు. మన్యంకొండ గుట్టపై రిజర్వాయర్ పనులు 60శాతం పూర్తి అయ్యాయని, పైప్‌లైన్లు పూర్తి అయ్యేవరకు రిజర్వాయర్లు పూర్తి అవుతాయన్నారు. మరో రూ.120కోట్ల నిధులు రానున్నాయని రూ.40కోట్ల నిధులు ఇప్పటికే మున్సిపాలిటీకి చేరుకున్నాయని మరో రూ.80కోట్ల నిధులు రానున్నాయని తెలిపారు. డిఇలు చిత్తశుద్దితో పని చేయాలని సూచించారు. సిబ్బంది చేతి వాటాలు మానుకుని అవినీతి రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలన్నారు. బినామీలను మాత్రం సహించేది లేదని ఒక పేరిట డబుల్ దందాలను ఉపేక్షించమని చేతకానీ కాంట్రాక్టర్లు వెళ్లిపోవచ్చని హెచ్చరించారు. పనుల నిర్లక్ష్యంలో అధికారుల ఆలసత్వం స్పష్టంగా కనబడుతుందని కాంట్రాక్టర్లు కూడా ఇదే అదునుగా భావించి పనులు చేయకుండా ఉండడం భావ్యం కాదన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ రాధ ఆమర్ మాట్లాడుతూ పనుల నిర్లక్ష్యం కారణంగా ప్రజల్లో తాము చేతకానీ వాళ్ల మాదిరిగా చూస్తున్నారని పట్టణాభివృద్ధి కోసం కాంట్రాక్టర్లు, అధికారులు సమన్వయంతో పని చేసినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కాగా పలువురు కాంట్రాక్టర్లు సమావేశంలో ఇసుక కోరతపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, పనులకు ఇసుక కోరత ఉండదని పట్టణంలో ఇళ్ల నిర్మాణం ఎక్కడైన ఆగిపోయిందా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ పనులకు కమీషనర్ ప్రత్యేక చొరవ తీసుకుని ఇసుక ఇప్పించే భాద్యత తీసుకోవాలన్నారు. ఇటివల కలెక్టర్‌తో మాట్లాడమని మహబూబ్‌నగర్‌లో ఇసుక డిపోలు త్వరలోనే ఏర్పాటు కానున్నాయని ఇసుక సమస్య తీరుతుందన్నారు.

అక్రమ కట్టడాల్లో తప్పెవరిది

ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, డిసెంబర్ 3: మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో 570 అక్రమ కట్టడాలు ఉన్నట్లు మున్సిపల్ సిబ్బంది గుర్తించారు. ఇందులో దాదాపు 300లకుపైగా భ వంతులు, ఇళ్ల నిర్మాణం, వివిధ షేడ్ల ఏర్పాటుతో పాటు ప లు వ్యాపార వాణిజ్య సంస్థలు కూడా ఉన్నాయి. అయితే అక్రమ కట్టడాలను గుర్తించిన మున్సిపల్ అధికారులు ప్ర స్తుతం వాటిని కూల్చివేసేందుకు రంగంలోకి దిగారు. పునాదుల నుండి భవంతుల వరకు నిర్మాణం జరిగేటప్పుడు ఎలాంటి హెచ్చరికలు చేయకుండా అలాంటి వారికి పునాదుల స్థాయిలోనే నోటీసులు ఇవ్వకుండా, పనులను ఆపివేయకుండా భవంతులు పూరై ఇళ్లల్లో కాపురాలు చేస్తున్న సమయంలో ప్రస్తుతం మున్సిపల్ సిబ్బంది వచ్చి అక్రమ కట్టడమంటూ కూల్చివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శనివారం మహబూబ్‌నగర్ పట్టణంలో ఏనుగొండ, బస్టాండు తదితర ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బంది అక్రమ కట్టడాలను కూల్చీవేశారు. దాంతో పట్టణంలో పలు వార్డులలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. భవంతులు కూ ల్చీవేస్తున్న సమయంలో యజమానులు సిబ్బందిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో మున్సిపల్ శాఖ అధికారులు పోలీసులను రంగంలోకి దింపారు. కూల్చీవేత ప నులు సజావుగా జరగనివ్వడం లేదని నిబంధనాలకు విరుద్దంగా ఇళ్ల నిర్మాణం, భవంతులు నిర్మించుకున్నారని పోలీసులకు మున్సిపల్ సిబ్బంది తెలిపారు. దాంతో పోలీసులు యజమానులు కూల్చీవేతలను అడ్డుకోవద్దని అలా ప్రవర్తిస్తే కేసులు న మోదు చేస్తామని హెచ్చరించారు. ఏనుగొండలో ఓ భవంతిని కూల్చివేస్తున్న సమయంలో ఓ బాధిత మహిళ తాము అప్పులు చేసి ఇల్లు కట్టామని నిర్మాణం చేసేటప్పుడు ఎందుకు తమకు చెప్పలేదంటూ పూజచేసి ప నులు సజావుగా చేసుకుంటున్న నేపథ్యంలో ఇంటిని కూలగొడుతామంటే ఎలా అంటూ అధికారులను ప్రశ్నించారు. ఓ పక్క మహిళ టౌన్ ప్లానింగ్ అధికారితో వాగ్వివాదం పెట్టుకోగా మరోపక్క మున్సిపల్ సిబ్బంది మాత్రం భవంతి కూల్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కుటుంబ సభ్యులు ఆ పనులను అడ్డుకోవడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని నివారించారు. మహిళ రోదిస్తూ అధికారులపై శాపనార్థలు పెడుతూ తమ బతుకును బజారుకు ఈడ్చారని రోదించింది. ఇంతలోపే టిఆర్ ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటయ్యతో పాటు మరో తెరాస కౌన్సిలర్ భర్త నరసింహులు వందలాది మంది కార్యకర్తలు నాయకులు అక్కడికి చేరుకుని మున్సిపల్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. తాము ఫిర్యాదు చేసిన అక్రమ కట్టడాలను ఎందుకు కూల్చలేదని ఇక్కడే ఎందుకు టార్గెట్ పెట్టి కూలుస్తున్నారని టౌన్ ప్లానింగ్ అధికారిని టి ఆర్ ఎస్ నాయకులు ప్రశ్నించారు. ఇంతలోపే రూరల్ పోలీసులు రంగంలోకి దిగారు. వెంకటయ్యతో పాటు పలువురు నాయకులను సముదాయించారు. తాము నిబంధనాల మేరకు కూ ల్చీవేస్తున్నామని మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు. ఇది ఇలా ఉండగా ప్రశాంత్ హోటల్ భవంతిని కూడా కూల్చీవేశారు. ఇక్కడ కూడా రగడ మొదలైంది. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆమర్‌లతో పాటు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి చేరుకుని మున్సిపల్ సిబ్బందిని నిలదిశారు. ఇంతలోపే టూటౌన్ పోలీసులు రంగంలోకి దిగారు. మున్సిపల్ సిబ్బంది పనికి అడ్డు తగులోద్దని పోలీసులు కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు. దింతో పోలీసులకు, కాంగ్రెస్ నాయకులకు వాగ్వివాదం చోటుచేసుకుంది.

పంచాయితీ అధికారి తీరుపై కలెక్టర్ ఆగ్రహం

గద్వాల, డిసెంబర్ 3: నూతన జోగుళాంబ గద్వాల జిల్లా అభివృద్ధికి అన్నిశాఖల అధికారులు సమన్వయంతో ము ందుకు సాగాల్సి ఉందని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సమస్యలు, అభివృద్ధి, పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం తాండవించిందని ఇందుకు గ్రామ కార్యదర్శులు తస్మత్ జాగ్రత్త అంటూ కలెక్టర్ రజత్‌కుమార్‌షైని హెచ్చరించారు. శనివారం గద్వాల పట్టణంలోని బాలభవన్‌లో గ్రామపంచాయితీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాలలో ఇంటి పన్నుల వసూళ్లు, ఈ పంచాయి తీ, నిధుల విడుదల, ఖర్చు తదితర అంశాలపట్ల జిల్లా పం చాయితీ అధికారి నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ఆ యనపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా స్థాయి అధికారి కేవలం మాటలతో కిందిస్థాయి అధికారులకు, సిబ్బందికి హుకుంజారీ చేస్తే పనులు ఎలా సాగుతాయని, ఏదైనా సరే రాతపూర్వకంగా సర్క్యులర్ ద్వారా జారీ చేయాలని ఆదేశించారు. గ్రామస్థాయిలో పారిశుద్ధ్యం, గ్రామకంఠం భూముల సర్వే, లే ఔట్లు, హరితహారం, పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టిని సారించాలని కలెక్టర్ ఎంపిడిఓ, ఇఓపిఆర్ డి, గ్రామ కార్యదర్శులకు దిశనిర్దేశం చేశారు. గట్టు మండలం కొత్తపల్లి గ్రామంను ఆదర్శంగా తీసుకొని బహిరంగ మలవిసర్జనతో పాటు పారిశుద్ధ్యంపై చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామకంఠం, భూముల సర్వే నివేదికలను జనవరి 15లోగా సమర్పించాలని సూచించారు. ఇప్పటికే గ్రామ కార్యదర్శులు, ఎంపిడిఓలు బాధ్యతగా వ్యవహరించడం లేదని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని ఘాటుగా హెచ్చరించారు. ఈ సందర్భంగా కార్యదర్శుల పనితీరుపై సభలో చివాట్లు పెట్టారు. ఇంటి పన్నులు వసూళు చేయని కార్యదర్శులను ఎదురైన సమస్యలను అడిగి అన్ని అర్హతలు ఉండి పన్ను చెల్లంచకుంటే కేసులు నమోదు చేయించాలని ఆదేశించారు. ప్రతి నెల 7వ తేదిలోగా గ్రామాల్లోని జనన మరణ వివరాలను ఎంపిడిఓ, తహశీల్దార్లకు గ్రామకార్యదర్శులు అందించాలని, మిషన్ భగీరథ పథకానికి గ్రా మాల్లో పైపులైన్ నిర్మాణాలకు చొరవ చూపాలన్నారు.

పాత కరెన్సీ రద్దుతో నల్లధనానికి అడ్డుకట్ట
పాలమూరు యూనివర్సిటీ విసి రాజారత్నం
బల్మూర్, డిసెంబర్ 3: కొండనాగుల ఎస్‌విఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ఇండియాలో పాతనోట్ల రద్దు-సవాల్ ప్రతిఫలాలు అనే అంశంపై తెలంగాణ రాష్ట్ర స్థాయి ఒక రోజు వర్క్‌షాప్ కార్యక్రమం జరిగింది. ఈ చర్చాగోష్టిలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పాలమూరు యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ రాజారత్నం మాట్లాడుతూ పాతకరెన్సీ అయిన 500, 1000 నోట్ల రద్దుతో దేశంలో నల్లధన ప్రవాహానికి కొంత వరకు అడ్డుకట్టపడినట్లయిందని అన్నారు. నల్లడబ్బు కలిగిన కొందరు సమాజాన్ని, ప్రభుత్వాలను శాషిస్తూ సామాన్య ప్రజలకు ఆర్థిక సమానత్వం లేకుండా చేస్తున్నారని అన్నారు. కొత్త కరెన్సీ అందుబాటులోకి వచ్చే వరకు ప్రజలలో కొంత అలజడి ఉండడం సహజమని ప్రజలను, ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకునేలా విద్యావంతులు, విద్యార్థులు తమవంతు కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ చర్చాగోష్టి కార్యక్రమంలో పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి, ఉస్మానియా యూనవర్సిటీ ప్రొఫెసర్లు పురుషోత్తంరావు, చెన్నప్ప పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కళాశాల కామర్స్ డిపార్టుమెంట్, తెలంగాణ కామర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. చర్చాగోష్టిలో యూనివర్సిటీల రీసెర్చ్ విద్యార్థులు, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఉపాధ్యాయులపై కేసు నమోదు
కొత్తకోట, డిసెంబర్ 3: మండల పరిధిలోని అమడబాకుల ఆదర్శ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న విజయరాణిపై సహ ఉపాధ్యాయులైన నరేష్ కుమార్, నాగరాజు, శ్రీనివాస చారిలు వేదిస్తున్నారని, వారిపై చర్య తీసుకోవాలని బాదితురాలు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవికాంత్ రావు శనివారం తెలిపారు.

స్థంభించిన బ్యాంకు లావాదేవీలు

షాద్‌నగర్, డిసెంబర్ 3: రైతుల రుణాలతోపాటు ఖాతాల వినియోగదారులకు లావాదేవీలు బ్యాంకులలో పూ ర్తిగా స్థంభించిపోయా యి. పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినప్పటి నుండి బ్యాంకులలో కేవలం డబ్బులు డిపాజిట్, రిజర్వు బ్యా ంకు ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం వా రానికి సేవింగ్ ఖాతాదారులకు 24వేలు, క రంట్ అకౌంట్ ఖాతాదారులకు 50వేలు చెల్లించాలని ఆదేశాలు ఉన్నాయి. బ్యాంకుల్లో కొరత వల్ల ఐదువేలు, ఆరువేలు మాత్రమే చెల్లిస్తుండడంతో బ్యాంకుల ముందు పెద్ద క్యూలైన్లు నిలబడుతున్నారు. దీంతో యథాప్రకారం బ్యాంకు మేనేజర్‌తో సంప్రదించేందుకు లోపలికి వెళ్లిన ప్రజలకు క్యూలైన్‌లో పెద్దఎత్తున ఉండడం వల్ల బ్యాంకు లోపలికి వెళ్లడం చాలా కష్టంగా మా రింది. ఒకవేళ బ్యాంకు లోపల వెళ్లి మేనేజరును సంప్రదించినా తీవ్ర రద్దీ కారణంగా బ్యాంకు అధికారులు ఎలాంటి సరైన సమాధా నం ఇవ్వలేకపోతున్నారు. దీంతో రైతుల రుణాలు మ ంజూరు చేయడం పూర్తిగా నిలిచిపోయింది. ఇతర బ్యాంకులలో లోన్ రుణాలు తీసుకునేందుకు నోడ్యూస్ సర్ట్ఫికేట్ విద్యార్థుల రుణాలు, డిపాజిట్, ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్, డిమాండ్ డ్రాప్ట్ తదితర బ్యాంకు లావాదేవీలకు వెళ్లినప్పటికి క్యూలైన్‌ను చూసి తిరిగి వాపస్ వెళ్తున్నారు.
దీని కారణంగా బ్యాంకు లావాదేవీలు పూర్తిగా స్థంభించిపోయాయి. దీని వల్ల సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం పాతనోట్ల రద్దు కారణంగా రద్దీ ఏర్పడినప్పటికి బ్యాంకులలో పూర్తి స్థాయి సిబ్బంది లేరని, కొత్తగా ఏర్పడిన రద్దీ కారణంగా బ్యాంక్ స్ట్ఫాను ఎక్కువ పెంచలేదని, బ్యాంకులో ఉన్న సిబ్బంది మాత్రమే ఉన్నారు. అందువల్ల రద్దీకి ప్రస్తుతం ఉన్న సిబ్బంది సరిపోవడం లేదని, అందువల్ల నూతనంగా బ్యాంకు సిబ్బందిని పెంచి సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా లావాదేవీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. నిబంధనలు విధించి 25రోజులు గడిచినా బ్యాంకుల ముందు క్యూలు తగ్గలేదని, బ్యాంకులో డబ్బు కొరత కారణంగా రోజు గంటల తరబడి క్యూలో నిలబడ్డప్పటికి కొంతమంది డబ్బు అందుతుందని, కౌంటర్ వద్దకు వెళ్లగానే డబ్బులు అయిపోయానని మరికొంతమందికి బ్యాంకు అధికారులు తెలపడంతో ఆవేదన చెందుతూ తిరిగి వెళ్లిపోతున్నారు.

ఓట్ల కోసం దళితల మధ్య చిచ్చు పెట్టొదు

కల్వకుర్తి, డిసెంబర్ 3: ఓట్ల కోసం దళితుల మధ్య చిచ్చు పెట్టవద్దని, రాజకీయ స్వార్థంతోనే తెలుగు రాష్ట్రాల లో మాదిగలకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటిస్తున్నారని మాలల చైతన్య సమితి వ్యవస్థాపకులు మూలే కేశవులు వి మర్శించారు. శనివారం పటట్ణంలోని ప్రభుత్వ అతిథి గృ హంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాలల చైతన్య సమితి వ్యవస్థాపకులు మూలే కేశవులు మాట్లాడుతూ భారత రాజ్యాగ నిర్మాత అంబేద్కర్ దేశంలో 59 ఉప కులాల అభివృద్ది కోసం విద్య, ఉద్యోగ, రాజకీయ ర ంగాలలో సమానంగా అభివృద్ది చెందాలని హక్కులు కల్పిస్తే ఓట్ల కోసం మాల, మాదిగల మద్య చిచ్చు పెడుతూ వారి ఐక్యతకు విఘతం కలిగిస్తున్నారన్నారు. అలాగే వర్గీకరణ చేల్లదని సుప్రీం కోర్టు తెలిపిన అన్ని రాజకీయ పార్టీల నాయకులు మాదిగలకు మద్దతు ఇస్తే ఓట్లు వేస్తారని మద్దతు ఇవ్వడం జరుగుతుందని, దళితుల అభివృద్ధ్దిపై చిత్తశుద్ది ఉంటే 15 శాతం ఉన్న దానిని 25 శాతానికి పెంచాలన్నారు.
దేశంలో 29 రాష్ట్రాలలో ఎస్సీ లు 59 ఉప కులాలుగా ఉన్నారని మిగితా 57 ఉప కులాల పరిస్థితి ఎమిటని, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ బావజాలాలకు వర్గీకరణ వ్యతిరేకమని ఆయన గుర్తు చేశారు. ఈ విలేఖరుల సమావేశంలో మాలల చైతన్య సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుధాకర్, కార్యవర్గ సభ్యులు బంగారయ్య, నాయకులు మరిశ్రీను, నరేష్, శ్రీను తదితరులు ఉన్నారు.