మహబూబ్‌నగర్

కరవు నేలకు కృష్ణమ్మ పరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, డిసెంబర్ 11: కృష్ణాజలాలు మన పొలాల్లోకి ఎప్పుడు వస్తాయోనని ఎదురుచూసిన రైతాంగానికి ఈ ఏడాది రబీ సీజన్ ప్రారంభానికి ముందే కృష్ణానదీ జలాలు చెరువుల్లోకి, వాగులు, వంకల్లోకి చేరడంతో నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాల రైతాంగం ఆశలు నేరవేరాయి. దశాబ్దాల కాలం పాటు ఎన్నో పోరాటలు ఉద్యమాలు చేసి సాదించుకున్న ప్రాజెక్టుల నుండి సాగునీరు వస్తుండడంతో ఈ ప్రాంత రైతాంగంలో నూతనోత్సహం నెలకొంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి సంబందించి లిఫ్ట్-1,2,3ల ద్వారా శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను ఎత్తిపోస్తూ సాగునీటిని రైతులకు అందజేసే ప్రక్రియలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో ఎల్లూరు రిజర్వాయర్ నుండి కల్వకుర్తి మొదటి లిఫ్ట్ ద్వారా ఈ రబీ సిజన్‌లోనే దాదాపు 20వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. అదేవిధంగా జోన్నల బొగడ, కల్వకుర్తి లిఫ్ట్-2 ద్వారా కృష్ణాజలాలను ఎత్తిపోసి కల్వకుర్తి లిఫ్ట్-3 గుడిపల్లిగట్టుకు తరలిస్తున్నారు. దాంతో కల్వకుర్తి లిఫ్ట్-3లోని రెండు మోటర్లను రన్ చేసి ప్యాకేజి 29,30 కాలువల ద్వారా నీటిని వదిలారు. దాంతో నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలోని పలు మండలాల్లో చెరువులు, కుంటలు నిండుతూ ఆలుగులు పారుతున్నాయి. అందులో భాగంగా ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని కల్వకుర్తి లిఫ్ట్-3 గుడిపల్లిగట్టు లిఫ్ట్ నుండి 30వ ప్యాకేజి ద్వారా కాలువల్లో కృష్ణాజలాలు నిండుగా పారుతున్నాయి. తెల్కపల్లి మండల కేంద్రంలోని పెద్ద చెరువు నుండి పర్వతాపూర్ చెరువుకు కృష్ణాజలాలు చేరాయి. నాగర్‌కర్నూల్, అచ్చంపేట వెళ్లే ప్రధాన రహదారిపై తెల్కపల్లి సమీపంలో కృష్ణాజలాలు రోడ్డుపై పరుగులు తీస్తున్నాయి. గుడిపల్లి గట్టు నుండి వరదలా వస్తున్న కృష్ణాజలాలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల రైతులు తెల్కపల్లి చెరువును సందర్శించి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాదాపు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 30వ ప్యాకేజి ద్వారా దాదాపు 60వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అధికారులు భగీరథ ప్రయత్నం చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో ఈ రబీ సిజన్‌లోనే లక్ష ఎకరాలకు పైగా సాగునీరు అందించేందుకు కృష్ణాజలాలను ఎత్తిపోసే ప్రక్రియ ప్రారంభం కావడం ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు రావడంతో పలు నియోజకవర్గాల్లో వ్యవసాయానికి పూర్వవైభవం వచ్చిందని రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఎన్నో ఏళ్ల నుండి చుక్కనీటికి నోచుకోని వనపర్తి జిల్లా ఖిల్లాఘన్‌పురం పెద్ద చెరువు కృష్ణాజలాలు చేరడంతో జలకళ మళ్లింది. ఈ చెరువు కింద దాదాపు 2000 ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చేసింది.
ముఖ్యంగా నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లోని పలు మండలాల్లో కృష్ణాజలాలు పరుగులు తీస్తుండడం దాంతో రైతులు ఉబ్బితబ్బిబైపోతుంది. అదేవిధంగా ఎన్నడు లేని విధంగా మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల పరిధిలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల ద్వారా ఈ రబీ సిజన్‌లోనే (యా సంగి) దాదాపు మూడున్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు కృష్ణాజలాలను అందించాలనే తీసుకున్న నిర్ణయంలో భాగంగానే అటు కోయిల్‌సాగర్ ఇటు కల్వకుర్తి మరోపక్క సంగం బండ, ఇంకో భీమా, జూరాల ప్రాజెక్టుల ద్వారా కృష్ణాజలాలు వ్యవసాయ పొలాల్లోకి ఉరుకులు పరుగులు పెడుతున్నాయి.