మహబూబ్‌నగర్

అండగా ఉంటా ధైర్యంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడ్డాకుల, డిసెంబర్ 11: పోరాడి సాదించుకున్న తెలంగాణను అభివృద్ది చేసుకునే క్రమంలో కార్యకర్తలు నిరాశకు గురికాకుండా దైర్యంగా ఉండాలని మహబూబ్‌నగర్ ఎంపి జితెందర్‌రెడ్డి అన్నారు. టిఆర్‌ఎస్ మండల విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం ఆదివారం అడ్డాకుల మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షుడు నాగార్జున్‌రెడ్డి అధ్యక్షనత నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపి జితెందర్‌రెడ్డితో పాటు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపి జితెందర్‌రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు, ఎంపిలు, ఎమ్మెల్యేలు అందరు కలిసి సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. కార్యకర్తలు ఎదుర్కోంటున్న సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతందని తెలిపారు. ఎవైన చిన్న సమస్యలు ఉంటే వారే సరిచేసుకోవాలని ఆయన తెలిపారు. తమలో తాము గొడవలు పడకుండా ఐక్యంగా ఉండి పార్టీని అభివృద్ది పథంలో ముందుకు తీసుకెళ్లాలని హితవు పలికారు. కార్యకర్తలు దైర్యంగా పనిచేస్తే గ్రామాల్లో పార్టీ బలంగా మారుతుందని తెలిపారు. కార్యకర్తలకు పనులు కల్పించేదిధంగా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. కార్యకర్తలు బలపడితే పార్టీకి భవిష్యత్తు ఉంటుందన్న విషయాన్ని అందరు గుర్తుంచుకుని ముందుకు సాగాలన్నారు. ఉద్యమకారులకు పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఒక్కో మండలానికి రూ.కోటి రుపాయల మట్టిరోడ్డు పనులు మంజూరు అయితే వాటిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చిన్నారెడ్డి, సంపత్‌కుమార్‌లు కోర్టులో కేసు వేయడంతో పనులకు అటంకాలు ఏర్పాడ్డాయని తెలిపారు. అనంతరం గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జడ్పిటిసి రామన్‌గౌడ్, జడ్పి కో -అప్షన్ సభ్యుడు మహముద్, సింగిల్ విండో ఉపాద్యాక్షుడు శ్రీకాంత్, మాజీ ఎంపిపి కృష్ణయ్య, మార్కెట్ యార్డు ఉపాద్యక్షుడు శ్రీరాములు, గ్రామసర్పంచ్ రఘు పాల్గొన్నారు.