మహబూబ్‌నగర్

సంగంబండ రిజర్వాయర్ ప్రమాదంలో ఉందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్తల్, డిసెంబర్ 11: మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ మండలం పరిధిలోని సంగంబండ పెద్దవాగుపై నిర్మించిన చిట్టెం నర్సిరెడ్డి (సంగంబండ) బాలెన్సింగ్ రిజర్వాయర్ కట్ట ప్రాంతం ప్రమాదం అంచున చేరబోతుందని ఈప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఒకవైపు ప్రాజెక్టుకట్ట నీటి ప్రాంతంలోని కొంత భాగంలో రివిట్‌మెంట్‌లేక ఇసుక బస్తాలను తాత్కాలికంగా ఉంచడంతో నీటి తాకిడికి ఇసుక బస్తాలు ఉండలేక కట్ట లోతట్టు ప్రాంతం కోతకు గురవుతుందని, కట్ట పైభాగంపై పెద్ద పెద్ద గుంతలతోపాటు భూమి నెర్రెలు చీలిందని, కురిసిన వర్షపు నీరు వీటిలోకి వెళ్లడంతో పూర్తిస్థాయి కోతకు గురై ప్రాజెక్టు కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని ఈప్రాంతాలకు చెందిన నేరడగాం, సంగంబండ గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 2004లో ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. దాదాపు 16వేల ఎకరాలకు సాగునీటిని అందించే ఈప్రాజెక్టు ప్రభుత్వ నిధుల కొరతతో, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం మూలంగా ఏకంగా నిర్మాణానికి దాదాపు 12 సంవత్సరాల కాలం సాగదీయడం జరిగిందని చెప్పవచ్చు. ఈప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భూములు, ఇళ్లు కోల్పోయిన సంగంబండ, నేరడగాం, ఉజ్జెల్లి, పాత గార్లపల్లి గ్రామాలకు చెందిన ప్రజలున్నారు. ఈ గ్రామాలను పునరావాస గ్రామాలుగా గుర్తించారు. వీటిలో సంగంబండ పునరావాస గ్రామంలో మాత్రం కొంత మేర పనులు చురుకుగా సాగినప్పటికి ఇంకా చాలా పనులు పెండింగ్‌లో ఉన్నాయి. మరో పునరావాస గ్రామమైన పాత గార్లపల్లి గ్రామంలో ఇంకా చాలా ఇళ్ల నిర్మాణాలతోపాటు పాఠశాలలు, మసీదు, స్మశాన వాటిక, అంతర్గత రోడ్లు, శాస్విత తాగునీటి పరిస్కారం వంటి పనులు అనేకంగా పెండింగ్‌లో ఉన్నాయి. ఉజ్జెల్లి పునరావాస గ్రామాన్ని ప్రజలు ఇంక ఖాళీ చేయలేదు. సంగంబండ రిజర్వాయర్‌కు చెందిన బ్యాక్ వాటర్ గ్రామంలోకి వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర భయాందోనకు గురవుతున్నారు. ఇక్కడి పునరావాస గ్రామంలో ఎలాంటి పనులు పూర్తికాలేదు. పాత రేట్ల ప్రకారం నష్టపరిహారాన్ని చెల్లిస్తామని చెప్పడంతో ప్రజలు ముందుకురాకా, ఇళ్లను నిర్మంచుకోలేక పోతున్నారు. నేరడగాం గ్రామాన్ని పునరావాస గ్రామంగా 2010లో జీఓ విడుదల చేసినప్పటికి ఇంత వరకు డిడి గానీ, డిఎన్ గానీ వేయలేకపోవడంతో ఈగ్రామాల ప్రజలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.
ఈగ్రామానికి ఆనుకొని ఉన్న సంగంబండ రిజర్వాయర్ కట్ట పైభాగంలో రద్రాలు పడటం, నెర్రెలు చీలడం చోటుచేసుకోవడంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనన్న భయాందోళనకు గ్రామప్రజలు బిక్కు బిక్కుమంటూ గడుపుతన్నట్లు చెబుతున్నారు. ప్రాజెక్టులను పరిశీలించడానికి వచ్చిన ప్రతి ఒక్క పార్టీ నాయకులతో వారి గోడును వెలుబుచ్చుతున్నప్పటికి వారి సమస్యలను తీర్చుటకు వచ్చే మహానుభావులెవరని ఎదురు చూస్తున్నారు.