మహబూబ్‌నగర్

వైభవంగా శివ పార్వతుల కల్యాణోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్వకుర్తి, జనవరి 15: కల్వకుర్తి పట్టణ కేంద్రంలో గత మాసంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన నూతన బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. బొడ్రాయి ప్రతిష్టాపన 41 రోజు పూర్తి కావడంతో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు శివ పార్వతుల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎంపి మంద జగన్నాధం, టిఆర్‌ఎస్ కల్వకుర్తి నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి బాలాజి సింగ్, టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు గోలీ శ్రీనివాస్‌రెడ్డిలు ముఖ్య అతిథులుగా హజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే మొదటగా సంక్రాంతి పర్వదిన పండుగను పురస్కరించుకొని ఈ ఏడాది కూడా మండల పరిధిలోని గ్రామాలు తాండ్ర, తర్నికల్, సుద్దకల్ గ్రామాలలోని ఈదమ్మమాదాత దేవాలయాలను మామిడి తోరణాలు. విద్యుత్ దీపాలంకరణతో ఎంతో శోభయమానంగా అలంకరించారు. తాండ్ర గ్రామంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి పాల్గొన్ని ఈదమ్మ మాదాతకు పూజలు నిర్వహించారు. పూలదండలతోఅలంకరణించిన రథం, ఎద్దుల బండిపై కొత్త చీరలతో అలంకరించిన కర్రకు చివరిపై భాగంలో కడుపుతో ఉన్న గొర్రెను కట్టి ఇరువైపుల గోవింద నామా స్మరణతో ఎంతో ఉత్సహ భరితంగా యువకులు అటు ఇటు గుడి చుట్టు లాగారు, అనంతరం అట్టి గొర్రెను గొర్రెల మందలో వదిలారు. రెండు గ్రామాలలో మహిళలు, యువతులు, చుడముచ్చటగా అలంకరించిన బోనం కుండలను తలపై పెట్టుకొని ఉరేగింపుగా గ్రామ దేవతలను దర్శించుకొని మొక్కులను చెల్లించుకున్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకొకుండా కల్వకుర్తి ఎస్సై జలందర్‌రెడ్డి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు దామోదర్‌గౌడ్, రాకేష్, శ్రీను, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న మంత్రి జూపల్లి
పాన్‌గల్, జనవరి 15: మండల పరిధిలోని బుసిరెడ్డిపల్లి గ్రామంలో సంక్రాంతి సంబరాల సందర్బంగా శనివారం పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎండ్ల బండ్ల ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సంర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకోవాలని, పరిసరాల పరిశుబ్రత అందరి బాద్యత అన్నారు. ఈ సందర్బంగా మంత్రి జూపల్లి ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి వెంకటేశ్ నాయుడు, జడ్పీటిసి రవి, టిఆర్‌ఎస్ నాయకులు గోవర్దన్ సాగర్, తిరుపతయ్య సాగర్, కిరణ్‌కుమార్, వీరసాగర్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా బండలాగుడు పోటీలు
పెద్దకొత్తపల్లి, జనవరి 15: మండల పరిధిలోని పెద్దకార్పాముల గ్రామంలో ఫ్రేండ్స్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బండలాగుడు పోటీలను ఆదివారం ఎంపిపి వేంకటేశ్వరరావు, జడ్పీటిసి వెంకటయ్య, సర్పంచ్ శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ పోటీలలో వివిధ జిల్లాలకు చెందిన 16 జతల ఎద్దులు పాల్గొన్నాయి. కర్నూల్ జిల్లా బజారికి చెందిన ఎద్దులు 4.520 ఫీట్ల దూరంలాగి మొదటి బహుమతిగా రూ.40వేలు గెలుచుకున్నాయి. కర్నూల్ జిల్లా వేంకటేశ్వరరావుకు చెందిన ఎద్దులు 4,500 ఫీట్ల దూరం లాగి రెండో బహుమతిగా రూ.30వేలు గెలుచుకున్నారు. కర్నూల్ జిల్లాకు చెందిన మహేంద్రనాయుడు 4,492 ఫీట్లులాగి మూడో బహుమతిగా రూ.20వేలు, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన చంద్రన్నకు చెందిన ఎద్దులు 4,419 ఫీట్లులాగి నాల్గొ బహుమతిగా రూ.10వేలు గెలుచుకున్నాయి. ఈ పోటీలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఎల్లయ్య, రాముడు, గోవిందు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.