మహబూబ్‌నగర్

గోమాత సకల దేవతల స్వరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జనవరి 15: భారతీయ సనాత ధర్మంలో గోవు ధర్మదేవతగా భావించి అనాదికాలం నుండి పూజిస్తున్నారని తిరుమల తిరుమతి దేవస్థానం సమన్వయ కర్త రామాచార్యులు తెలిపారు. ఆదివారం మహబూబ్‌నగర్ పట్టణంలోని పరమళగిరి కొండ శ్రీ వీరాంజనేయస్వామి దేవాలయంలో సంక్రాంతి కనుమ పండుగను పురస్కరించుకుని గోపూజ కార్యక్రమాన్ని తిరుమ తిరుపతి దేవస్తానం, హిందూధర్మప్రచార పరిషత్తు మహబూబ్‌నగర్ జిల్లా వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా పరమళగిరి కొండపై వెలసిన శ్రీ రామాంజనేయస్వామి దేవాలయ ప్రాంగాణంలో గోపూజ నిర్వహించారు. అదేవిధంగా చిన్నదర్పల్లి గ్రామ శివారులోని శ్రీలక్ష్మీ గోశాలలో గో పూజ కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్దలతో చేపట్టారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం సమన్యయ కర్త రామాచార్యులు మాట్లాడుతూ భారతీయ సనాత ధర్మ పరిహ్యప్తం కొనసాగడానికి గోవును ధర్మ దేవతగా భావించి అనాది కాలం నుండి గోవును పూజించినట్లు వేదాలు పెర్కొన్నాయని అన్నారు. ఔకల దేవతల స్వరూపంగా గోవును ఆరాదించడం జరుగుతుందని అన్నారు. గోమాత, వేదమాత, భూమాత, అని గోవును తల్లి స్థానంలో నిలిచిందన్నారు. ప్రతి భారతీయుడు గోవును పూజించడం వల్ల సకల శుభాలు వర్తిస్తాయని తెలిపారు. ప్రతి కుటుంబంలో ఒక గోవు ఉంటే ఆ ప్రాంతం అంతా సుభీక్షంతో ఉంటుందని పురాణాలు ఘోషిస్తున్నాయని తెలిపారు. గోవు హత్య మహాపాపమని కొందరు ఆ పాపాలకు పాల్పడటం వల్ల వారి సమాజం విచ్చిన్నమవుతుందని అందుకే వారికి సమాజం ఓ రకంగా చూస్తారని అన్నారు. గోవు ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ లక్ష్మీ స్వరూపం ఉంటుందని వేదాలు చెబుతున్నాయని అన్నారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలలో సైతం గోవులను పెంచడంలో కొంత నిర్లక్ష ధోరణి కనిపిస్తుందని ఆ దోరణినీ విడాలని ప్రతి రైతు ఓ గోవును పెంచుకునేలా సమాజంపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు రైతులకు నచ్చజెప్పి గోవులను సంరక్షించుకునే విధంగా కృషి చేయాలని అన్నారు. గోవు ఇంటిముందు ఉంటే ఆ ఇంట్లో సంస్కారం, సంసృతి పిల్లలకు అలవాటు వస్తుందని గోవు పాలు చాలా శ్రేష్టమైనవని గోవు పాలను ప్రతి రోజు పిల్లలకు తాపితే జ్ఞానం పెరగడమే కాకుండా రోగ నిరోదకశక్తి పెరుగుతుందన్నారు. ముఖ్యంగా జ్ఞాపక శక్తి పెరుగుతుందని చిన్నతనంలో ప్రతి రోజులు గోవును చూసిన పిల్లాడు చరిత్రకారుడిగా తయారవుతారని పురాణాల్లో ఉందని అన్నారు. ప్రస్తుతం తమ పిల్లలకు తల్లిదండ్రులు భారతీయ సంసృతి సాంప్రదాయాలను నేర్పించాల్సిన అవసరం ఉందని పాశ్చత సంసృతి ఇంటి గడపలోకి రానివ్వకుండా తల్లిదండ్రులు తమ పిల్లలను సంక్రమమైన మార్గంలో పెంచాలని సూచించారు. కొల్లూరి భీమాచారి మాట్లాడుతూ గోవును రఘువంశ కాలం నుండి పూజించినట్లు పురాణాలు చెబుతున్నాయని తెలిపారు. పూర్వకాలంలో సంతానం లేని వారు గో పూజ చేస్తే సంతానప్రప్తి లబించిందని అన్నారు. అలాంటి మహాశక్తి గల గోవును పూజించడం చాలా అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాణేచారి, ముకుందారెడ్డి, పరందాములుగౌడ్, ముత్యాల రఘు, గోపాలకృష్ణ ఆర్య, చంద్రకళారెడ్డి, శిశికళ, ప్రభావతమ్మ, దుప్పల్లి శ్రీరాములు, రాజమల్లేష్, ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.