మహబూబ్‌నగర్

సంసృతి, సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జనవరి 15: సంసృతి, సాంప్రదాయాలకు సంక్రాంతి పండుగ ప్రతికగా నిలిచిందని ఈ పండుగ పత్రి వ్యక్తిలో సాంప్రదాయాలను నెర్పిస్తుందని ఆర్‌ఎస్‌ఎస్ ఖండ కార్యవాహా శేరి వెంకటయ్య అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాలమూరు జిల్లా కేంద్రానికి సమీపంలోని హన్వాడ మండలం శేక్‌పల్లి, నాగినోనిపల్లి, హన్వాడ గ్రామాల్లో సంక్రాంతి సందర్నంగా ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో పలు సాంసృతిక కార్యక్రమాలతో పాటు యువకులకు ఆటల పోటీలను నిర్వహించారు. వివిధ గ్రామాల్లో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు పదసంచా కార్యక్రమంలో పాల్గొన్ని ప్రదర్శన చేశారు. వివిధ గ్రామాలకు చెందిన ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు వందలాది మంది పాల్గొన్నారు. ఆదివారం నాగినోనిపల్లి గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆర్‌ఎస్‌ఎస్ ఖండ కార్యవాహా శేరి వెంకటయ్య మాట్లాడుతూ దేశం కోసం పని చేస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రజల్లో దేశ సంసృతి సాంప్రదాయాలను కాపాడేందుకు కృషి చేస్తుందని అన్నారు. రోజు రోజుకు యువకుల్లో దేశ భక్తి సన్నగిల్లుతుందని అలా కాకుండా ప్రతి యువకుడు దేశ భక్తితో ఉండేలా గ్రామ గ్రామాన ఆర్‌ఎస్‌ఎస్ శాఖలను విస్తరింపజేయాలని సూచించారు. సంకాంత్రి పండుగ ప్రజలందరిల్లో నూతన ఉత్సహన్ని తెస్తుందని ముఖ్యంగా మహిళల్లో తాగి ఉన్న సంసృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా వాటిని తమ ముగ్గుల రూపాల్లో చూయిస్తారని తెలిపారు. సంక్రాంతి ముగ్గులకు చాలా విశిష్టత ఉందని అన్నారు. ప్రతి హిందువు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారని తెలిపారు. ఏ పండుగ కూడా మూడు నాలుగు రోజుల పాటు ఉండదని కొన్ని పండుగలు ఉత్సవాల పేరిట వారం పది రోజులు ఉంటాయని కానీ సంక్రాంతికి ఉన్న ప్రత్యేకత మాత్రం ఏ పండుగకు ఉండదని అన్నారు. కుటుంబ సభ్యులు అందరు కలుసుకుని చేసుకునే పండుగ అని ఇదే ఈ పండుగ గొప్పతనమని అన్నారు. ఇలాంటి పండుగ సందర్భంగా గ్రామీణ ప్రాంతాలలో ఆర్‌ఎస్‌ఎస్ ఎన్నో దేశ భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తుందని, ముఖ్యంగా యువకులను అందరిని ఒకచోటుకు చేర్చి వారిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయడం జరుగుతుందన్నారు. ప్రతి హిందువు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా తయారు అయితే దేశానికి ఎలాంటి ముప్పు ఉండదని ప్రతి వ్యక్తిలో దేశ భక్తి వచ్చినప్పుడు దేశం తమ కుటుంబం అనే భావన వచ్చేస్తుందని తెలిపారు. హన్వాడలో జరిగిన కార్యక్రమంలో పాలమూరు నగర బౌద్ద ప్రముఖ్ యాదయ్య మాట్లాడుతూ భారతీయ సంసృతి సాంప్రదాయాలు ప్రపంచంలోనే గొప్పతనం అని ఈ సంసృతిలో మనిషి జీవన విదానం ఉందన్నారు. యువకులు, విద్యార్థులు గ్రామ గ్రామాన ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శాఖలకు వచ్చేలా కార్యకర్తలు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు మామిడిమాడ వెంకటయ్య, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు దాసరి కేశవులు, కొండ సతీష్, ఖమ్మరి లక్ష్మీనారాయణ, దానం తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా వివిధ గ్రామాల్లో నిర్వహించిన పలు ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేశారు.