మహబూబ్‌నగర్

క్రీడలను విస్మరించిన గత ప్రభుత్వాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జనవరి 15: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో గత పాలకులు, ప్రభుత్వాలు క్రీడలను విస్మరించారని దాంతో గ్రామీణ ప్రాంతంలో నైపుణ్యం గల క్రీడాకారులు ఎంతో మంది నష్టపోయారని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. స్వామివివేకానంద జయంతి, సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మహబూబ్‌నగర్ మండలం జమిస్తాపూర్ గ్రామంలో నిర్వహించిన జిల్లా స్థాయి కబ్బడీ, వాలిబాల్, పరుగుపందెం, తదితర గ్రామీణ స్థాయి క్రీడాపోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముంగిపు కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ క్రీడల్లో గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేశారు. అదేవధంగా సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీల్లో పాల్గొన్న గ్రామ మహిళలకు సైతం ఎమ్మెల్యే బహుమతులు ప్రదానం చేశారు. కాగా కొద్దిసేపు ఎమ్మెల్యే క్రీడాకారులతో కలిసి ఆటలు ఆడి అందరిని ఉత్సహపరిచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ గత పాలకులు తెలంగాణ ప్రాంతంలో క్రీడలను పూర్తిగా విస్మరించారని ఎంతో మంది యువతి, యువకులు, విద్యార్థులు క్రీడల్లో నైపుణ్యం ఉన్న వారిని బయటకు తీసుకురాలేదని అన్నారు. అన్ని రంగాలల్లో తెలంగాణను సమైక్యపాలకులు విస్మరించారని ఆరోపించారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఏ క్రీడల్లో రాణిస్తారో వాటికి ప్రచారం చేయకుండా అడ్డుకున్నారని దాంతో చాలా నష్టం జరిగిందన్నారు. తెలంగాణ ప్రాంతంలో మైదానాలను కూడా ఏర్పాటు చేయలేకపోయారని నియోజకవర్గ కేంద్రాలలో సైతం ఆటలు ఆడుకోవడానికి క్రీడా మైదానాలను సైతం ఏర్పాటు చేయలేదని విమర్శించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాకా ముఖ్యమంత్రి కెసిఆర్ తొలిసారిగా అందరు ఆశ్చర్యపడేలా రూ.100 కోట్లు రాష్ట్ర బడ్జెట్‌లోనే నిధులు కేటాయించారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం కోటి రూపాయలు కేటాయించి చేతులు దులుపుకున్నారని వాటిని కూడా వారి ప్రాంతంలోనే ఖర్చు చేశారని అన్నారు. క్రీడాకారిని సానియామిర్జానే రాష్ట్ర అంబాసిటర్‌గా పెట్టి ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలోనే క్రీడల పట్ల ఉన్నటుసవంటి మక్కువను చాటుకున్నారని తెలిపారు. తెలంగాణలో నైపుణ్యం గలిగిన క్రీడాకారులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రతి రాష్ట్ర అవరతరణ దినోత్సవం రోజు జిల్లాల వారిగా ఉత్తమ క్రీడాకారులకు బహుమతులు ప్రధానం చేస్తున్నారని తెలిపారు. వారికి ఆర్థిక సహాయం కూడా అందుతుందని అన్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కోటి రూపాయలతో మినిస్టేడియం నిర్మాణాలనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అదేవిధంగా మండల కేంద్రాలలో కూడా మైదానాలను ఏర్పాటు చేస్తుందన్నారు. జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్‌లో మరో స్టేడియం నిర్మాణం చేపడుతున్నామని అందుకు గాను ఇప్పటికే పనులు ప్రారంభించామని ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తున్నామని వాటి ప్రతిపాదనలు పూర్తి అయ్యావని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలో రాబోయే రెండేళ్లలో చాలా మంది క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే అవకాశం ఉందని అందుకుగాను ప్రభుత్వం వారికి చేయూతనిస్తుందని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పట్ల కూడా ఆసక్తి కనబరచాలని సూచించారు. యువకులు క్రీడల్లో రాణిస్తే చాలా ఉద్యోగాలలో అవకాశాలు లబిస్తాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలోని యువత సమాజాక స్పృహా ఎక్కువగా ఉంటుందని తమ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని గ్రామంల కోసం మంచి చేయాలనే తపన ప్రతి ఒక్కరిలో ఉన్నప్పుడే గ్రామం అభివృద్ధి బాటలో పయనిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి సావిత్రి, నాయకులు రాజేశ్వర్‌గౌడ్, గౌతం శ్రీను రామచంద్రయ్య, ప్రతాప్‌రెడ్డి, మల్లు నర్సింహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.