మహబూబ్‌నగర్

సమగ్ర కుటుంబ సర్వే వివరాలను వివరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జనవరి 24: ముఖ్యమంత్రి కెసిఆర్‌కు దమ్ము, ధైర్యం ఉంటే ఎంతో హడావిడిగా ఇక తెలంగాణ ప్రజల బతుకులు ఒకేరోజు మారిపోతాయని నిర్వహించిన సమగ్ర కుటుంబసర్వే వివరాలను ఎందుకు బహిర్గతం చేయడం లేదని సమగ్ర కుటుంబ సర్వే వివరాలను తొక్కిపెట్టారని, తక్షణమే వాటిని బహిర్గతం చేయాలని ఏఐసిసి కార్యదర్శి, సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. మహబూనగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో రెండవ రోజు కాంగ్రెస్ యాత్రలో భాగంగా మంగళవారం ఉదయం మహబూబ్‌నగర్‌లోని ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో విహెచ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ బిసిలలోని కులాలను ఆసరా చేసుకుని కులాల మధ్య చిచ్చుపెట్టి బిసిల ఐక్యతను దెబ్బతిసి బిచ్చగాళ్ల మాదిరి తలో రూ.2 కోట్లు ఇస్తూ తలో సంఘానికి 400 గజల భూమిని ఇస్తూ ఇక ఆ కులాల ప్రజలు అంతా బాగుపడ్డారనే విధంగా గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రికి దమ్ము, ధైర్యం ఉంటే సమగ్ర కుటుంబ సర్వే వివరాలను బహిర్గతం చేసి ఆ విధంగా బిసిలకు బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. సమగ్ర కుటుంబ సర్వే వివరాల కోసం ఇప్పటికే తాను గవర్నర్‌కు రెండుసార్లు లేఖలు రాశానని గవర్నర్ అనుమతితోనే ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబ సర్వే చేశారని, గవర్నర్‌కు నెలరోజులు సమయం ఇస్తున్నానని, ఈ నెలరోజుల వ్యవధిలో సమగ్ర కుటుంబ సర్వే వివరాలు వెబ్‌సైట్‌లో బహిర్గతం చేయకపోతే ఫిబ్రవరి చివరివారంలో గవర్నర్ ఇంటి ముందు తాను నిరవధిక దీక్షకు దిగుతానని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలను తాగుబోతులుగా తయారు చేస్తున్నారని విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని మద్యం విక్రయాలతో వచ్చిన డబ్బుతోనే కెసిఆర్ తన పదవిని కాపాడుకుంటూ పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. కెసిఆర్ నడ్డివిరచాలంటే రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు మద్యాన్ని నిషేధించాలని ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు. అయితే తాను ప్రత్యేకంగా మద్యాన్ని నిషేధించాలని కూడా మహిళలతో కలిసి ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తానని, రాష్ట్రంలో ఆందోళన కార్యక్రమాలకు దిగుతానన్నారు. కులాల వారిగా ప్రజలను విడదీసి ఓట్ల రాజకీయం చేస్తున్నారని ఇక కెసిఆర్ అగడాలను చుస్తూ ఉరుకునేది లేదని, ఇక బిసిల తడాఖా ఏందో చూపిస్తామని, అందుకు కాంగ్రెస్ పార్టీ నడుం బిగిస్తుందన్నారు. కెసిఆర్ నరేంద్రమోదీ భజన చేస్తున్నారని, దాని వెనుక పెద్ద మతలబు ఉందని ఆరోపించారు. త్వరలోనే కెసిఆర్ చేస్తున్న మతలబును బహిర్గతం చేస్తానని, తన దగ్గర ఆధారాలు ఉండే మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. ఇక బీహార్ ప్రజలు మద్యాన్ని నిషేధించడాన్ని హర్షిస్తున్నారని, ఒకేరోజు 3 కోట్ల మంది నితీష్‌కుమార్‌కు మద్దతుగా వచ్చి సంఘీభావం తెలపడం చాలా గొప్పవిషయమన్నారు. విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ నేతలు ఉబేదుల్లా కొత్వాల్, బెనహర్, రాజేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మతం పేరిట దేశాన్ని ముక్కలు చేస్తున్న మోదీ
* అన్ని మతాలను గౌరవించే సంస్కారం కాంగ్రెస్‌దే
* ఎఐసిసి కార్యదర్శి హనుమంత రావు
వనపర్తి, జనవరి 24: దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చాకా మోదీ ప్రభుత్వం మతం పేరిట దేశాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్నదని ఎఐసిసి కార్యదర్శి హనుమంత రావు అన్నారు. మంగళవారం వనపర్తికి వచ్చిన ఆయన పట్టణంలోని రాజీవ్‌చౌరస్తాలో రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో ఆర్‌ఎస్‌ఎస్ పాలన కొనసాగుతున్నదని, దేశంలో నీతివంతమైన పాలన, అన్ని మతాలను గౌరవించే ప్రభుత్వం రావాలంటే అది కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుందని అన్నారు. పెద్ద నోట్లను రద్దు చేసిన మోదీ ప్రభుత్వం 50 రోజుల్లో అంతా సర్దుకు పోతుందని చెప్పారని ఈ 50 రోజుల కాలంలో నల్ల కుబేరులు తమ నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారని అన్నారు. ఈ 50 రోజుల్లో పేద, మధ్య తరగతి కుటుంబాలే ఇబ్బందులకు గురయ్యారని, పెద్ద నోట్ల రద్దుతో మృతి చెందిన వారి పట్ల ప్రధాని మోదీ కనీసం సానుభూతి కూడా తెలుపకపోవడం విచారకరమని అన్నారు. ఎ ఐసిసి కార్యదర్శి, వనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ జి.చిన్నారెడ్డి మాట్లాడుతూ దేశంలో 86శాతం రూ.500, రూ.1000 నోట్లు ఉన్నాయని దీంతో నల్లధనం పెరిగిపోయిందని, నల్లకుబేరుల వద్ద డబ్బు నిల్వ ఉన్నదని తీవ్రవాదులతో కూడా డబ్బు ఉన్నదని చెప్పారన్నారు. ఈ నోట్లను రద్దు చేసే కంటే ముందే కనీసం అందులో సగం శాతమైన కొత్త నోట్లను ప్రభుత్వం ప్రచురించి ఉంటే దేశ ప్రజలకు ఈ దుస్థితి కలిగి ఉండేది కాదని అన్నారు. ఎఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీ పిలుపుమేరకు దేశం మొత్తంలో తిరిగి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకు రావాడానికి కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఒబేదుల్లా కోత్వాల్, ప్రధాన కార్యదర్శులు హర్షవర్ధన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, నాయకులు కిషన్, శంకర్‌ప్రసాద్, తిరుపతయ్య, కిరణ్‌కుమార్ తదితరులున్నారు.