మహబూబ్‌నగర్

బాల్య వివాహాలను అడ్డుకున్న పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధన్వాడ, ఏఫ్రిల్ 14: ధన్వాడ మండల కేంద్రంలో రెండు బాల్య వివాహలను అడ్డుకున్నట్లు ధన్వాడ మండల తహశీల్దార్ శంకరయ్య తెలిపారు. గురువారం ధన్వాడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మండల తహశీల్దార్ శంకరయ్య మాట్లాడుతూ ధన్వాడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న నవనిత అనే మైనర్ బాలికను ఈనెల 17న ఊట్కూర్ మండలంలోని పెద్దపోర్ల గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి నిర్ణయించారని తెలిపారు. గ్రామస్థులు సమాచారం ఇవ్వడంతో నవనిత తండ్రి బాబుకు చెప్పిన వినకపోవడంతో మరికల్ పోలీసుల సహకరంతో నవనితను జిల్లా కేంద్రంలో ఉన్న స్టేట్ హోంకు తరలించినట్లు తెలిపారు. అదేవిధంగా ధన్వాడ మండల కేంద్రంలోని అవుల మంజూల అనే విద్యార్థి ధన్వాడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతుందని తహశీల్దార్ తెలిపారు. మంజుల అనే మైనర్ బాలికను ఈనెల 22న మఖ్తల్ మండలంలోని గుడిగండ్ల గ్రామానికి చెందిన యవకుడితో వివాహంకై నిర్ణయించగా గ్రామస్థుల సమాచారం మేరకు మంజుల తండ్రి బాల్‌రాజుకు కౌన్సిలింగ్ ఇచ్చిన వినకపోవడంతో మరికల్ పోలీసుల ద్వారా మంజులను జిల్లా కేంద్రంలోని స్టేట్‌హోంకు తరలిస్తున్నట్లు తహశీల్దార్ శంకరయ్య తెలిపారు.

నియోజకవర్గ అభివృద్ధ్దికే టిఆర్‌ఎస్‌లో చేరా..
మక్తల్, ఏప్రిల్ 14: మక్తల్ నియోజవర్గం అభివృద్ధి కోసమే తనూ టిఆర్‌ఎస్ పార్టీలో చేరడం జరిగిందని, తనకు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ద్రోహం చేసిన దాఖలాలు కానీ, తన వ్యక్తిగత స్వార్థంతోగానీ టిఆర్‌ఎస్‌లో చేరలేదని అన్నారు. గురువారం మక్తల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన తండ్రిగారైన మాజీ దివంగత ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి పక్కా తెలంగాణ వాధి అని తెలిపారు. తన తండ్రి ముందు ఉన్న ఏకైన ఆశయం భీమా ప్రాజెక్టును నిర్మింపచేసి రైతులకు సాగునీటిని అందించాలన్నదే ఆయన ముందున్న లక్షమని అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం రాష్ట్రంలో అధికార పార్టీ ఒకటి ఇక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉంటే అభివృద్ధి సాధ్యం కాదని అన్నారు. గడచిన రెండు సంవత్సరాలుగా తను ముఖ్యమంత్రి కెసిఆర్ పట్టుదలను గమనిస్తున్నాననీ, మిషన్ కాకతీయ పథకం రైతన్నల పాలిట ఎంతో వరమన్నది గమనించి తాను టిఆర్‌ఎస్‌లో చేరడం జరిగిందని చెప్పారు. టిఆర్‌ఎస్ ప్లీనరి సభలో తమ నియోజకవర్గ ప్రజలను, నాయకులను, యువకులను, మహిళలను కలసి వారి పూర్థిస్థాయి అభిప్రాయసేకరణతో భారీ సంఖ్యలో టిఆర్‌ఎస్ ఖండువ కప్పుకోవడం జరుగుతుందని చెప్పారు.