మహబూబ్‌నగర్

రక్తదానం చేసి ప్రాణదాతలుకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తకోట, మే 15: రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. సోమవారం పట్టణంలోని కొత్తకోట సర్కీల్, రెడ్‌క్రాస్ సోసైటి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగిన వెంటనే రక్తస్త్రావం జరిగి ఎందరో మృత్యువాత పడుతున్నారని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరు రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని, రక్తదానం చేయడం వల్ల మరొకరి ప్రాణాలు కాపాడడమే కాకుండా మన ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగు పడుతుందన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని ఆమె అన్నారు. ఈ రక్తదాన శిబిరంలో 52 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి చెన్నయ్య, సిఐ శ్రీనివాసులు, సర్పంచు చెన్నకేశవరెడ్డి, జడ్పిటిసి పి.జె బాబు, ప్రశాంత్, బాబురెడ్డి, కటికెశ్రీను, వాసీమ్, నాగన్నసాగర్, వామన్‌గౌడ్, సాయులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోల్‌మాల్‌పై అధికారుల స్పందన

పెబ్బేరు, మే 15: పెబ్బేరు మండల పరిధిలోని సూగురు గ్రామంలో సింగిల్‌విండో ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులకు ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తించిన అధికారులు, అధికారేతర వ్యక్తితో కొనుగోలు చేసిన వారిపై జిల్లా జాయింట్ కలెక్టర్ నిరంజన్ ప్రత్యేకంగా సివిల్ సప్లైయ్ అధికారులతో వచ్చి పరిశీలించారు. ధాన్యం కొనుగోలులో రైతులకు మోసం చేయడాన్ని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన ధర్నా నిర్వహించి అధికారుల దృష్టికి తేవడం జరిగిందని కాంగ్రెస్ బిసి సెల్ జిల్లా అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ తెలిపారు. అక్కడే ఉన్న అధికారులు ధాన్యపు రాసులను చూయించారు. కొనుగోలు చేసి రాసిచ్చిన చిట్టిలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సంబంధిత సోసైటి అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఎలక్ట్రానిక్ కాంటాలతో రైతులకు ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని వారికి తెలిపారు. చిట్టీలు రాసివ్వడం ఏమిటని ఇటువంటి పనులు ఇకనుండి సాగవని ఆయన తెలిపారు. అక్రమాలకు తావివ్వకుండా అధికారులు అక్కడే ఉండి తుకాలలో ఎలాంటి అవకతవకలు జరగకుండా పర్యవేక్షించాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఆన్యాయం జరగనివ్వమని ఆయన వారికి హామి ఇచ్చారు. ధాన్యానికి డబ్బులు 10 రోజుల్లో వారి వారి ఖాతలో జమ చేస్తామని జాయింట్ కలెక్టర్ రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో డిసిఓ శంకరాచారి, సివిల్ సప్లైయ్ అధికారి తనూజ, డిటి నరేందర్, ఎంపిటిసి నాగమ్మ, బుచ్చన్నయాదవ్, నరసింహ్మనాయుడు, శేఖర్, కురుమన్న, రైతులు తదితరులు పాల్గొన్నారు.