మహబూబ్‌నగర్

కరెంట్ వాగ్ధానం నెరవేర్చిన ఘనత కెసిఆర్‌దే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 14: రాష్ట్ర ప్రజానికానికి, రైతాంగానికి కరెంట్ కష్టాలు తీరుస్తామని ముఖ్యంగా రైతులకు హామీ ఇచ్చిన 9 గంటల విద్యుత్ సరఫరా వాగ్ధానాన్ని నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌కే దక్కిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం మహబూబ్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని హన్వాడ మండల కేంద్రంలో వ్యవసాయ రంగానికి పగటిపూట 9 గంటల విద్యుత్ సరఫరా కార్యక్రమాన్ని మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రైతులకు కోతలు లేని కరెంట్‌ను అందిస్తామని ఇచ్చిన వాగ్ధానాన్ని నెరవేర్చిన ఘనత టి ఆ ఎస్ ప్రభుత్వానికే దక్కిందని తెలిపారు. 2005 నుండి 2012 వరకు విద్యుత్ సరఫరాలో లోపం, లో ఒల్టెజి, విద్యుత్ షాక్‌లకు గురై 1630 మంది రైతులు జిల్లాలో చనిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు కలలో కూడా ఊహించని పథకాలను ఆమలు చేస్తూ అందరు ప్రసంశలు అందుకుంటుందని తెలిపారు. రూ.35.200కోట్లతో పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, మీషన్‌కాకతీయ, మీషన్ భగీరథ అన్ని గ్రామాలకు రవాణ సదుపాయం వంటివి కల్పిస్తూ బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తుందని రాజకీయాలకు అతీయితంగా గ్రామాలను అభివృద్ది చేసుకుని భాద్యత గ్రామస్థులపైనే ఉందన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ మహబూబ్‌నగర్ జిల్లాలో పగటిపూట రైతులకు 60 ఏళ్ల సమైఖ్య పాలనలో 9 గంటలు కరెంట్ ఇచ్చిన దాఖలాలు లేవని వారు ఇచ్చింది కేవలం రెండు మూడు గంటలు తప్పా. కరెంట్ కోతలు విధించారని ఆరోపించారు. 2019కి ముందే రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుకు చేశారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా హన్వాడ ప్రాంత ప్రజలకు హేమసముద్రం గుండా సాగునీరు అందుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామాల్లో రోడ్ల మరమ్మత్తులు, విస్తరణ, పరిశ్రమలు, సంక్షేమ పథకాలను ఆమలు చేస్తుందన్నారు. ప్రజలు ప్రస్తుతం వచ్చిన కరువు కారణంగా నిరాశ పడకుండా ధైర్యంతో ముందుకు వెళ్లాలని అభివృద్ధి దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ హన్వాడ ప్రాంత ప్రజలను దృష్టిలో ఉంచుకుని పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందేలా తీవ్రంగా కృషి చేస్తామని తెలిపారు. హేమసముద్రం నిర్మాణానికి అడ్డంకులు సృష్టించినప్పటికిని వాటిని అదిగమించి సాధించడం జరిగిందని రైతులు, గ్రామస్థులు రాజకీయాలకు అతీయితంగా కృషి గ్రామాలను అభివృద్ధి పర్చుకోవాలని కోరారు.