మహబూబ్‌నగర్

రోడ్ల మరమ్మతులకు ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 14: రాష్ట్రంలో రోడ్ల మరమ్మత్తులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. గురువారం మహబూబ్‌నగర్ పట్టణంలోని మెట్టుగడ్డ నుండి పిల్లలమర్రికి వేళ్లే రోడ్డు వెడల్పు పనులకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు బాగుంటే రవాణ వ్యవస్థ బాగుంటుందనే ఉద్దేశ్యంతో రోడ్ల మరమ్మత్తుకు ఎన్నడు లేని విధంగా కోట్లాది రుపాయల నిధులను ఖర్చు చేస్తుందన్నారు. మహబూబ్‌నగర్‌లోని మెట్టుగడ్డ నుండి పిల్లలమర్రి వరకు వెళ్లే రోడ్డును వెడల్పు పనులకు రూ.1.55కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. పిల్లలమర్రి పర్యటక కేంద్రం కాబట్టి సింగిల్ రోడ్డు ఉన్నందున వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయని కోరారు. ప్రజల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రోడ్డు వెడల్పు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు.
జిల్లాలోని రోడ్ల మరమ్మత్తు కోసమే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ. 2400కోట్ల నిధులను విడుదల చేసిందన్నారు. రోడ్ల సంబందించిన బ్రిడ్జిల నిర్మాణానికి కూడా మరో వేయ్యికోట్ల నిధులు కేటాయించడం జరిగిందన్నారు. మిలమిల మెరిసే రోడ్లను తీర్చిదిద్దాలని సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. మహబూబ్‌నగర్ పట్టణంలో కూడా రోడ్ల మరమ్మత్తుకై కోట్లాది రుపాయల నిధులు మంజూరు చేయించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇఇ గిరిష్‌కుమార్, అధికారులు స్వామి, సంధ్య, కౌన్సిలర్ జంగమ్మ, నాయకులు రాజేశ్వర్‌గౌడ్, వెంకటయ్య, చెన్నయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు.