మహబూబ్‌నగర్

మరో భద్రాద్రిగా శ్రీరామకొండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోయిలకొండ, ఎప్రిల్ 15: కోయిలకొండ మండల కేంద్రంలోని శ్రీరామకొండను మరో భద్రాచలంగా తీర్చిదిద్తుతానని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం శ్రీరామకొండపై సీతారామకల్యాణాన్ని కన్నుల పండుగగా వేదమంత్రాలతో భక్తి భావనతో నిర్వహించడం జరిగింది. శ్రీరామకొండ అభివృద్దికి తాను స్వంతంగా రూ. 25 లక్షలు ఇస్తున్నానని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ప్రకటించడం విశేషం. శ్రీరామకొండపై సీతారామ కల్యాణాన్ని ఎంతో భక్తి భావంతో నిర్వహించడం జరిగింది. రాష్ట్ర నలుమూల నుండి శ్రీరామకొండపైకి చేరుకొని కల్యాణరాముడి ప్రత్యేక పూజలు నిర్వహిచారు. ఇక శ్రీరామకొండ సీతారామ కల్యాణంలో ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు. శ్రీరామపాదానికి ప్రత్యేక పూజాకార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో శ్రీరామకొండ ఎంతో ప్రఖ్యాతిగాంచిందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అనేక దేవాలయాలను అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్ని పనిచేయడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రిని ఆదర్శంగా తీసుకొని శ్రీరామకొండ అభివృద్ధి చేస్తానన్నారు. అన్ని శాఖల సమన్వయంతో రాబోయో కొద్ది కాలంలోనే శ్రీరామకొండ అభివృద్ధి జరుగుతుందన్నారు. అంతకు ముందు శ్రీరామకొండ కింద, మధ్యలో రోడ్డు నిర్మాణం, వాటర్‌ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో రవిందర్‌రెడ్డి వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.