మహబూబ్‌నగర్

వాణిజ్య పన్నుల అధికారినంటూ అక్రమ వసూళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవపాడు, ఆరు నెలలుగా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్‌నంటూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని మానవపాడు పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. పట్టుకున్న వ్యక్తిని మానవపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కె.సత్యనారాయణ అనే వ్యక్తి గద్వాలలోని పిజెపి క్యాంప్‌లో డ్రైవర్‌గా విధులను నిర్వహిస్తున్నాడు. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ సురేష్ అనే అధికారికి సత్యనారాయణకు ఉన్న కారును లీజుకు పెట్టాడు. ప్రతిరోజు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ సురేష్ అనే అధికారికి డ్రైవర్‌కు వచ్చేవాడు సత్యనారాయణ. అధికారి ఆరు నెలల క్రితం బదిలీపై వెళ్లడంతో ఇదే అదునుగా తీసుకున్న సత్యనారాయణ అనే వ్యక్తి నకిలి స్టాంపులతో, నకిలి బిల్లులతో అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు. ప్రతి రోజు రూ.10వేల నుంచి రూ.14వేల వరకు వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. సత్యనారాయణపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సి ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ విలేకర్ల సమావేశంలో శాంతినగర్ ఎస్ ఐ వెంకటేష్, కోదండాపురం ఎస్‌ఐ ఉమామహేశ్వర్‌రావు, పోలీస్ సిబ్బంది సుబ్బారెడ్డి, మస్తాన్ తదితరులు ఉన్నారు.