మహబూబ్‌నగర్

ఇంటర్మీడియట్ ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 22: 2015-16 విద్యా సంవత్సరానికి సంబందించిన ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితియ సంవత్సరం పరీక్షా ఫలితాలు శుక్రవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేశారు. అయితే జిల్లా ఫలితాల్లో మాత్రం నిరాశే మిగిలింది. ఫస్టియర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు రాష్ట్రంలో ఎనమిదవ స్థానంలో నిలిచారు. అదేవిధంగా సెకండియర్‌లో 6వ స్థానంలో నిలిచారు. ఫస్టియర్‌లో ఈ ఏడాది 31502 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా అందులో 13912 మంది విద్యార్థులు ఉతీర్ణత సాధించారు. గత సంవత్సరం కన్న ఈ ఏడాది వచ్చిన ఫలితాలు ఒక శాతం తగ్గాయి. ఫస్టియర్‌లో 44 శాతం విద్యార్థులు ఉతీర్ణులయ్యారు. అదేవిధంగా సెకండియర్‌లో 29193 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అందులో 16178 మంది విద్యార్థులు ఉతీర్ణత సాధించారు. రాష్ట్రంలో మరోసారి ఇంటర్మీడియట్ ఫలితాలు ఆశించిన స్థాయిలో రాలేకపోవడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు నిరాశకు గురయ్యారు.