మహబూబ్‌నగర్

వేరుశనగ మద్దతు ధరలో గందగోళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, పిబ్రవరి 23: మహబూబ్‌నగర్ వ్యవసాయ మార్కెట్‌యార్డులో వేరుశనగ మద్దతు ధరపై రైతుల్లో గందరగోళం నెలకొంది. రోజుకో ధర వస్తుండడంతో ఆగ్రహించిన రైతులు ఏకంగా మహబూబ్‌నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డుపై వేరుశనగ రైతులు దాడికి దిగిన సంఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. అధికారులు, వ్యాపారస్తులు కుమ్మకై తమకు రావల్సిన మద్దతు ధరను రానివ్వకుండా చేస్తున్నారని రైతులు ఆందోళనకు దిగారు. శుక్రవారం టెండర్ల ప్రక్రియ ముగిసిన తర్వాత రైతులు వ్యాపారులకు వేరుశనగను ఇవ్వడానికి సుముఖత చూపలేదు. గత మూడునాలుగు రోజుల క్రితం రూ.4800్ధర పలికిన వేరుశనగ ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.4100 ఇవ్వడం ఏమిటని అధికారులను, వ్యాపారస్థులను నిలదీశారు. ఎక్కువ ధర రూ.700 తగ్గించడం, తక్కువ ధర రూ.1800 నుండి బీట్ వేయడం ఏమిటని రైతులు నిలదీశారు. తక్కువ ధర గత నాలుగైదు రోజుల క్రితం రూ.3500 ఉండగా ప్రస్తుతం రూ.1000లకుపైగా తగ్గించి తమను మోసం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్దతు ధర ఇచ్చేవరకు తాము వేరుశనగను తూకం చేయనివ్వమని రైతులు తెల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో తాము ఇదే ధర ఇస్తామని చెప్పడం ఇందుకు అధికారులు కూడా వ్యాపారస్తుల వైపు మొగ్గుచూపడం రైతులకు ఆగ్రహం తెప్పించింది. ఒక్కసారిగా రైతులు వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి అధికారులతో వాదించి అక్కడి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా రోడ్డెక్కి ధర్నా, రాస్తారోకోకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు డీస్పీ భాస్కర్‌తో పాటు సీఐలు, ఎస్‌ఐలు అక్కడికి చేరుకుని రైతులను సముదాయించి రాస్తారోకోను విరమింపచేయించారు. అంతలోపే తిరిగి రైతులు వ్యవసాయ మార్కెట్‌యార్డుకు చేరుకుని మరోసారి ధర్నాకు దిగారు. అప్పటికే మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వర్, డైరెక్టర్లు రైతులను సముదాయించి మంచిధర పలికేవిధంగా చూస్తామని హామీ ఇచ్చారు. శనివారం రిటెండర్లు వేస్తామని, రైతులు ఆందోళన చెందకూడదని రాత్రికి ఇక్కడే ఉండాలని సూచించారు. అన్ని సౌకర్యాలను కల్పిస్తామని రైతులకు నచ్చజెప్పారు. కాగా రైతులు మాత్రం వ్యాపారస్తులకు వత్తాసు పలకకూడదని వ్యవసాయ మార్కెట్ పాలక వర్గం సభ్యులు రైతుల పక్షాన నిలబడాలని వేరుశనగకు మద్దతు ధర వచ్చేలా కృషి చేయాలని కోరారు. మార్కెట్ యార్డు దగ్గర పోలీసు బందోబస్తును నిర్వహించారు. కాగా వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యదర్శి నవీన్ మాట్లాడుతూ కొందరు రైతులు ఆగ్రహంతో అనవసరంగా కార్యాలయంపై దాడి చేశారని పంటకు తగ్గట్టు ధరను కేటాయించడం జరిగిందని వ్యాపారస్తులతో అధికారులు ఎవరూ కుమ్మక్కు కాలేదని రైతులకు మేలు చేయడానికే తాము ఉన్నామని చెప్పుకొచ్చారు. రైతులు వ్యవసాయ మార్కెట్‌పై దాడి చేయడంతో తహశీల్దార్ ప్రభాకర్ అక్కడికి చేరుకుని ధ్వంసమైన ఫర్నిచర్‌ను పరిశీలించి పంచనామా చేశారు. రైతులు కార్యాలయంపై దాడి చేయడంతో సంబంధిత అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.