మహబూబ్‌నగర్

రైతుల సంతోషమే ప్రభుత్వ సంతోషం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్తల్, మే 21: రైతన్నల సంతోషమే టీఆర్‌ఎస్ ప్రభుత్వ సంతోషమని ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి అన్నారు. రైతులు పంట పెట్టుబడికి ఎవరి వద్ద చేయి చాచవద్దన్న లక్ష్యంతో ఎకరాకు రూ.4వేల చొప్పున పంట పెట్టుబడి సాయం ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో మిగిలిన చెక్కులు, పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్న అధికారుల కౌంటర్లను ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ కౌంటర్ల వద్ద రైతులను పలుకరించగా రైతుబంధు పథకంపై ప్రతి రైతు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే ఏ ప్రభుత్వం చేయని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకాన్ని రూపొందించి అమలు చేయడం హర్షనీయమన్నారు. కాగా భూముల వివరాలను పూర్తిగా సమగ్రంగా ఉండాలనే ఉద్దేశంతో 4నెలల వ్యవధిలో భూప్రక్షాళన పేరుతో సమగ్ర భూసర్వే చేయించి ప్రతి రైతుకు కొత్త పాస్‌పుస్తకాలు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మక్తల్ నియోజకవర్గంలో రైతుబంధు పథకం కింద రూ.107 కోట్లు పంపిణీ చేశామని చెప్పారు. ఈనెల 10 నుండి 19వరకు గ్రామాల్లో పంపిణీ జరగగా మిగిలిన రైతులకు మూడు రోజులపాటు తహశీల్దార్ కార్యాలయంలోనే ఇస్తారని తెలిపారు. నిర్ణీత సమయానికి వచ్చి రైతులు పాస్‌పుస్తకాలు, చెక్కులను తీసుకెళ్లాలని ఎమ్మెల్యే సుచించారు. ప్రతి రైతుకు అందజేస్తామని, ఒకవేళ ఇతర ప్రాంతాల్లో రైతులు ఉండి రాలేని యేడల 3నెలలలోపు ఎప్పుడు వచ్చినా ఇస్తామన్నారు. ఎమ్మెల్యే చిట్టెం వెంట ఎంపీపీ హన్మంతు, మార్కెట్ చైర్మన్ నర్సింహగౌడ్, తహశీల్దార్ వరప్రసాద్, ఉప తహశీల్దార్ సురేష్‌కుమార్, ఎంపీటీసీ రవిశంకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు కావలి శ్రీహరి, లక్ష్మణ్, నేతాజిరెడ్డి, నర్సింహరెడ్డి, ఈశ్వర్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.