మహబూబ్‌నగర్

జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కంకణబద్ధులవుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 2: మహబూబ్‌నగర్ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి అందరం కంకణబద్దులం కావాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆయన మహబూబ్‌నగర్‌లోని తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళ్లు అర్పించారు. అనంతరం జిల్లా పోలీస్‌పరేడ్ మైదానంలో జరిగిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలను ఉద్దేశించి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఎన్నో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో బలమైన అభివృద్ధి అడుగులు పడ్డాయని అన్నారు. అనతికాలంలోనే రాష్ట్రం అద్బుత విజయాలను సాధించామని చెప్పడానికి తాను ఈ వేదికనుండి గర్వంగా చెబుతున్నానని అన్నారు. వివిధ రంగాలలో రాష్ట్రం సాధించిన ప్రగతి, రాష్ట్ర ప్రభుత్వాలను అమలు చేస్తున్న పథకాలను దేశ, విదేశాల నుండి పలు ప్రశంసలు అందుతున్నాయని అన్నారు. సకల జనుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతుందని ప్రణాళిక బద్దమైన విధానాలు ఆర్థిక క్రమశిక్షణ ప్రజల దీవెనలతో అన్ని రంగాలలో రాష్ట్రం ముందడుగు వేస్తుందని అన్నారు. తెలంగాణ అమరవీరుల ఆశయసాధనలో భాగంగా సాధించుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. రైతుబంధు పథకం ఓ చరిత్రను సృష్టించిందని దేశంలోని అన్ని రాష్ట్రాల రైతాంగం దృష్టి తెలంగాణ వైపు మళ్లించుకున్న ఈ పథకాన్ని తమ రాష్ట్రాలలో కూడా అమలు చేసుంటే బాగుండేదనే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకం అమలుతో దేశ ప్రజల దృష్టి ఇటువైపు మళ్లిందన్నారు. ఎకరాకు రూ,4 వేల పెట్టుబడి సాయం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వంపై రైతుల నుండి ప్రశంసలు వస్తున్నాయని అన్నారు.
భూ రికార్డుల శుధ్దీకరణ గత పాలకులు చేయలేకపోయారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ పెద్ద నిర్ణయం తీసుకుని భూరికార్డుల శుద్దీకరణకు శ్రీకారం చుట్టి లక్షలాది మంది రైతులకు ఉన్న భూమి ఇబ్బందులను తీర్చారని అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాను వ్యవసాయంలో అభివృద్ధి పరచడానికి ముఖ్యంగా సాగునీటి వనరులను దృష్టిలో ఉంచుకుని దక్షిణాసీయా ఖండంలోనే అతిపెద్ద ప్రాజెక్టును నిర్మించడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. అది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకమని అన్నారు.
ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో దాదాపు ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుందని అన్నారు. శాంతి భద్రతల నిర్వహణలో జిల్లా పోలీసు యంత్రాంగం చూపిస్తున్న తీరు అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్, ఎస్పీ అనురాధ, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, డిఆర్‌ఓ వెంకటేశ్వర్లు, జాయింట్ కలెక్టర్ వెంకటరావు, అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు, డిపిఆర్‌ఓ పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు.