మహబూబ్‌నగర్

పాతిక్రేయులు సమాజ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, జూలై 19: పాతిక్రేయులు జర్నలిస్టు వృత్తితో పాటు సమాజ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ పిలుపునిచ్చారు. హెల్మెట్‌పై అవగాహనకై ఢిల్లీ నుంచి సీనియర్ పాత్రికేయుడు శరత్‌శర్మ బైక్ యాత్రలో భాగంగా గురువారం జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఆయనకు ఎమ్మెల్యే ఘనస్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సన్మానించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎందరో ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించక రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని, రోడ్డు ప్రమాదాలు నివారించడానికి, వాహనదారులకు అవగాహన కల్పించడానికి ఢిల్లీ నుంచి సుమారు 19000 కి.మీ బైక్ యాత్ర చేసుకుంటూ 19రాష్ట్రాలలో తన యాత్ర కొనసాగించడం అభినందనీయమని తెలిపారు. ప్రతి ద్విచక్రవాహనదారడు తప్పకుండా హెల్మెట్ వాడాలని, సెల్‌ఫోన్ మాట్లాడుతూ రైడింగ్ చేయరాదని, మద్యం సేవించి వాహనాలు నడుపరాదని కోరారు. పాత్రికేయులు కేవలం సమాచారం ప్రచురించే వరకు తమ భాద్యత అని భావిస్తుంటారని, అయితే వారందరికీ స్ఫూర్తి కలిగించేలా శరత్‌శర్మ చేపట్టిన సాహస యాత్ర యావత్ పాత్రికేయ లోకానికి మంచి స్ఫూర్తిదాయకమని ఆమె అన్నారు. అనంతరం శరత్‌శర్మతో భేటీ అయ్యారు. ఈకార్యక్రమంలో టీపీసీస కార్యవర్గ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి, టీయుడబ్ల్యూజెఐజేయు జిల్లా కన్వీనర్ ధరూర్ శ్యాం, రవీందర్ రెడ్డి, సుదర్శన్, ముస్తాపా, కాంగ్రెస్ నాయకులు బండల వెంకట్రాములు, నాగేందర్‌యాద్, రామాంజి, అన్వర్, బంగి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్ రోనాల్డ్‌రోస్‌తో ఎమ్మెల్యే భేటీ
* నియోజకవర్గ అభివృద్ధి పనులపై చర్చ
మహబూబ్‌నగర్‌టౌన్, జూలై 19: మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్‌తో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ భేటీ అయ్యి చర్చించారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై వారు సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ నూతన కలెక్టరేట్ ఏర్పాటుతో పాటు ఐటీ పార్కు, రాష్ట్రంలోనే అత్యధికంగా డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం జరిగిందని అన్నారు. మయూరీ పార్కు, బైపాస్‌రోడ్డు, బీసీ, ఎస్సీ హస్టళ్ల అడ్మిషన్లు, స్టడీ సర్కిల్ తదితర అంశాలపై చర్చించారు.