మహబూబ్‌నగర్

కేసీఆర్‌ది నియంత పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూలై 21: కేసీఆర్‌ది నియంత పాలన అని రాష్ట్రానికి ఇంలాంటి ముఖ్యమంత్రి కావడం ప్రజలు దురదృష్టంగా భావిస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ఆరోపించారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నూతనంగా నియమితులైన ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ సన్మాన సభ కార్యక్రమానికి మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్‌నేత భట్టివిక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి, మాజీ మంత్రులు త్రి చిత్తరంజన్‌దాస్, నాగం జనార్ధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ప్రతాప్‌రెడ్డి, వీరారెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు సంపత్‌కుమార్‌ను ఘనంగా సన్మానించారు. అనంతరం సన్మానసభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ పేదవారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నతమైన పదువులు పొందుతారని సంపత్‌కుమారే నిదర్శనమని తెలిపారు. విద్యార్థి దశ నుండే రాజకీయాలపై మక్కువ చూపి ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్, జిల్లా కాంగ్రెస్, పీసీసీ, ఎమ్మెల్యేగా ఎదిగిన సంపత్‌ను రాహుల్‌గాంధీ టీంలో ఏఐసీసీ సభ్యుడిగా ఉండడం అంటే ఆషామాషి విషయం కాదని అన్నారు. కష్టపడి పార్టీలో నిబద్ధతతో పనిచేసేవారికి కాంగ్రెస్ పార్టీలో తప్పకుండా న్యాయం జరుగుతుందని మంచి గుర్తింపు కూడా వస్తుందని తెలిపారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ వల్లే వచ్చిందన్న విషయాన్ని టీఆర్‌ఎస్ నాయకులు మరచిపోయి ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తూ తన పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చి దివాళా రాష్ట్రంగా తయారు చేసిన ఘనుడు కేసీఆర్ అని ఆయన దుయ్యాబట్టారు. రాష్ట్రంలో ప్రత్యేకమైన పరిస్థితులు కొట్టుమిట్టాడుతున్నాయని ఆరోపించారు. కేసీఆర్‌ను ఎప్పుడు గద్దెదింపుతామని ప్రజలే ఎదురు చూస్తున్న రోజులు రాష్ట్రంలో వచ్చేశాయని ఎప్పుడు ఎన్నికలు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని మహబూబ్‌నగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్, 14 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడం కూడా తథ్యమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల గొంతునొక్కి తానే రాజునని తనకు ఎవరూ అడ్డులేరని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని మేకను ప్రజలు కోసుకుని తినే రోజులు వచ్చేశాయని ఎద్దేవా చేశారు. ఏఐసీసీ కార్యదర్శి ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో టీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులను వేధిస్తున్నారని దాడులు చేస్తూ పోలీసులతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఇక చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. గులాబీ గుండాగిరి చేస్తే ఖబడ్దార్ అంటూ టీఆర్‌ఎస్ నేతలను ఉద్దేశించి సంపత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను గత 28 ఏళ్ల నుండి రాజకీయాల్లో ఉన్నానని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పని చేస్తున్న తరుణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. పాలమూరు గల్లీలో పార్టీ జెండాలను ప్రస్తుతం ఉన్న పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్‌యాదవ్ భుజాలపై ఎక్కి కరెంట్ స్తంభాలకు కట్టామని వాల్ రైటింగ్ చేశామని ఆ నాటి కష్టాలు తనకు ఈ స్థాయిలో గుర్తింపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని ముఖ్యంగా తాను రాహుల్‌గాంధీకి, సోనియాగాంధీకి రుణపడి ఉంటానని అన్నారు. తనను మహారాష్ట్ర పార్టీ ఇన్‌చార్జిగా నియమించారని తెలిపారు. మహారాష్టత్రో పాటు తెలంగాణ రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. మట్టిమనిషిగా పెరిగానని ఎన్ని కష్టాలైన ఎదుర్కొని పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి దేశానికి రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయడమే తమ ముందున్న లక్ష్యమని అన్నారు. తాను రాజకీయంగా ఓనమాలు నేర్చుకుంది ఎమ్మెల్యే చిన్నారెడ్డి నుండే అని అన్నారు. అంతేకాకుండా సంపత్ వేదికపై చిన్నారెడ్డికి పాదాభివందనం చేసి శిష్యుడినని అనిపించుకున్నారు. అయితే తాను గురువు ఉన్న స్థానంలోనే తాను ఉన్నానని చిన్నారెడ్డి సైతం ఏఐసీసీ సభ్యుడిగా ఉన్నారని తాను కూడా అదే టీంలో ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి మాట్లాడుతూ సంపత్‌కుమార్‌ను తాను కాంగ్రెస్ పార్టీలో దాదాపు 28 ఏళ్లుగా చూస్తున్నానని క్రమశిక్షణ గల కార్యకర్తగా ఎదగారని ఇందుకు తాను గర్వపడుతున్నానని తెలిపారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధైర్యంగా ఉండాలని కార్యకర్తకు గండగా నిలుస్తూ టీఆర్‌ఎస్ నాయకుల ఆగడాలను ఎదుర్కొనాలని సూచించారు. తాను ఈ వేదిక నుండి మరోసారి చెబుతున్నానని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే కేసీఆర్ జైలుకు వెళ్లకతప్పదని ఆయన కుటుంబంలోని ఇద్దరు ముగ్గురు కూడా జైలు ఊచలు లెక్కపెట్టుకోవడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అనితారెడ్డి, నాయకులు బెనహర్, బెక్కరి మదుసూధన్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, ఎన్‌పి. వెంకటేష్, లక్ష్మణ్‌యాదవ్, ప్రధీప్‌కుమార్‌గౌడ్, శ్రీహరి, కృష్ణ, కట్టా రవికిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.